చిలిపిలిపి
కాఫీ సురగంగ
నాలోన ప్రవహించ
ఆలోచన వాకిటిన
నిలిపేనుగా నన్నేమో
ఉత్తేజిత క్షణములన్ని
క్రొంగొత్త భావాలను ఉల్లేఖించసాగగా
బెట్టు చేయు కాలానికి
బిస్కెట్టు కాఫీయే
వరదై జ్ఞాపకాలను
విరిసేలా చేయునుగా
వరిచేలు గాలేదో వళ్ళంత తాకినట్టు
వలపంత వలకబోసి
చిలిపిగ నవ్వునుగా
చిలిపి లిపిని తనువంత చిలుకునుగా
-సి.యస్..రాంబాబు