యజ్ఞవాటికలో మౌనమై
పాత మడుగున కోనేటి పాచిని కొండా
కోనలపై నుంచి దిగిన కొత్తనీరు తోసినట్లుగా…
పాతరోజుల పండగలను నేటి కొత్త రోజులు
మతాల మారణహోమాలతో సినిమా
తంతున చూపిస్తున్నాయి…
వెలుగెంట నడిచిన మూగ ప్రయానమై
నిజాలను నిరూపించుకోలేక క్షణాల ముందర
నీళ్ళు నములుతు జీవితం నటనలతో
నడిచేటి ఒక ఆశేనని నిర్ధారణకు వచ్చావు…
ముక్కంటి దేవుడు ముల్లోకాలకు
ఆరాధ్యుడు దేవదానవుల కష్టం కంఠాన
గరళంగా దాగుందని తెలిసినా బతుకు
వక్కలవుతుందని నీళ్ళు నమలని నోటితో
చెప్పలేక…భస్మించిన యజ్ఞవాటికలో మౌనమై
పార్వతితో పరిణయం ఆగిపోరాదని…
శీగ్రమున తెరచిన కంటితో శిరస్సున గంగను
జలనిధిగా బంధించెను జఠాధారియై
పరమోత్తమాల కొరకు…
ఆస్తులు అంతస్థులు కొనలేవు
అంతిమాన మూడడుగుల చోటును…
జానెడు పొట్టకొరకు ప్రతిని బతిమిలాడుతు
జ్ఞాన సూత్రంతో పుట్టింది ఏడుపుతో
మొదలు…చచ్చేవరకు అందరి ఏడుపుల
శోకమయమై పదవుల కొరకు పాకులాడుతు
అందలమెక్కాక బురద నీటి పాదమై…
మోపిన బరువు క్రింద పేదవాడైతే శూన్యం
విరిగిన రెక్కలతో భావితరాలకు నీ సందేశం
నీళ్ళు నమిలేదే అవుతుంది…
అహో….ఆలోచనలకు తగలని లోకాలు
ఎన్నో…అతల వితల పాతాళ తలాతల
భూతల రసాతలాలు ఎన్నున్నా వాటన్నిటి
తర్పణాలు నీటితోనే… దేహం నందు
పొదగబడిన ప్రాణానికి ఆధారం నీరే…
గొంతారిన భాషతో నీళ్ళు నములుతు
అటు ఇటుకాని హృదయ స్పందనని
తుదిశ్వాసగా బంధించిన తులసి దళపు
మోక్ష దాతువై…పైలోకాలకు సాగనంపే
పరమౌషదం కూడా నీరే…నీళ్ళు నమలకు…
-దేరంగుల భైరవ