ప్రజా నాయకుడు..
ఇప్పుడు పరిస్థితులలో చాలా మార్పులొచ్చాయి ప్రజలు అంటే ఒక వర్గం, ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతంగా విడిపోయారు..అందుకని ప్రజా నాయకులు కూడా వర్గ, కుల, మత, ప్రాంతాల, వారీగా నాయకులయ్యారు..అలా ఉంటేనే మనము ఇష్టపడతాము, సామాన్య న్యాయం మాకు నచ్చదు వొద్దు..
న్యాయం, ధర్మం, తప్పొప్పులు, ఎవరికి వారు రాసుకున్నారు. అందుకని ఇది తప్పు, ఇది చెయ్యకు అని చెప్పేవాడు అక్కర్లేదు..
ఉదాహరణగా ఒక మాధ్యమంలో ఒక మహిళ తక్కువ బట్టలతో వాళ్ళ పదేళ్ల అభాయితో స్విమ్మంగ్ చేస్తున్న ఫోటగ్రాఫ్స్ పెట్టారు.. అది చూసిన వాళ్ళు అబ్బా అన్నారు,
మరికొందరు చీ అన్నారు..ఇప్పుడు ఎవరి వైపు మనం వుండాలి తప్పన్న వాడి వైపా?ఓహో అన్న వాడివైపా?లేక అలా ఫోటగ్రాఫ్స్ పెట్టిన ఆవిడ వైపా?
ఇప్పుడు ఓహో అన్నవాడు వాళ్ళ అమ్మని అలాంటి బట్టలతో చూడలేదు. కానీ వాడు ఆ ఫోటో కి స్పందించాడు..
అలా చూడనివాడే ఇలా స్పందిస్తే ,రేపు తల్లిని అలా చూసిన ఆ పిల్లలు ఎలా వుంటారు!! ఎలా ప్రవర్తిస్తారు!!..ఆమెకు అలా ఫోటో పెడితే డబ్బులిస్తారు. అది ఆవిడకి గొప్ప.
ఓహో అన్నవాడికి ఓ ఆహ్లాదం,చీ అన్నవాడికి కాలక్షేపం గా మిగిలిపోతుంది…మరి ఇప్పుడు నిజంగా ప్రజా నాయకుడు వుంటే వాడు ఎం చేస్తాడు..ఆమె ఇష్టమని చెప్తాడు!!!
ఎందుకంటే ఛి అనేవాళ్ళ కన్నా, ఓహో అనే వాళ్ళు ఆమెను సమర్థించే వాళ్ళే, ఎక్కువ. వాళ్ళే నాయకుడికి, నాయకుడవడానికి చాలా అవసరం..
ప్రజలు మారాలని కొందరు పెద్దలు, కాదు నాయకులే మారాలని జనాలు కొట్టుకుంటూ వుంటాము.. కానీ ఎవ్వరం మారం బహుశ ఇదే కలియుగమేమో..
తప్పుని తప్పు అంటే చాలా కష్టం.. వాడు నాయకుడు కాదుకదా, కనీసం మనిషిగా కూడా గుర్తించరు. ఎందుకంటే వాడు ఎదగలేదు. ఇంకా పాతకాలం మనిషిలా వుండిపోయాడు అని..
తప్పు అనే మాట మరిచిపోయిన మనం అన్నీ మంచే అనే భ్రమ లో వున్నాము, అలాగే బ్రతుకుతున్నాము, పోతున్నాము…కనీసం ఆ తప్పుల నైనా ,జాగ్రత్తగా చేయడం నాయకుడిగా వాడి భాద్యత..అలా ఉన్నవాడిని గెలిపించడం మన హక్కు…
This is my personal opinion…
if it is not relevent or sorry if this hurts someone…🙏
-శ్రీ కిరణ్