పిచ్చి
హరిణి కుమార్ గాఢంగా ప్రేమించు కున్నారు..ప్రేమంటె పిచ్చి ఇద్దరికీ..అందుకే ఇరు వర్గాల పెద్దలకు తెలియకుండా గుళ్లో పెళ్లి చేసుకున్నారు..పెద్ద వాళ్లకు తెలిసి విడదీసి హరిణిని తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నించినా దొరకకుండా తప్పించుకుంటూ కొంత కాలం తిరిగీ తిరిగీ అందరూ మర్చి పోయాక ఒక చోట కొత్త ఊర్లో కాపురం పెట్టారు..
అలా కొంత కాలం గడిచే సరికి హరిణి గర్బవతయింది..
కుమార్ దగ్గర తెచ్చిన డబ్బులు అయిపోయాయి..ఏ ఉధ్యోగం దొరకక ఆ కోపమంతా హరిణి మీద చూపించే వాడు దాంతో హరిణికి తప్పు చేసానేమెా! అని బాధ కలిగేది అయినా ఏం చేయలేని పరిస్థితి..ఎలాగో ఓర్చుకుని జీవిస్తుంది కుమార్ కోపం తిట్లతో ఆగక కొట్ల వరకు వచ్చింది..ఈ లోగా హరిణి పేరెంట్స్ కు వీళ్లు ఎక్కడ ఉన్నారో తెలిసి కుమార్ లేని టైంలో హరిణిని తీసుకెళ్లారు..
కుమార్ వింత ప్రవర్తనకు బెదిరి పోయిన హరిణి పేరెంట్స్ దగ్గరే ఉండి పోయింది..ఇంకోసారి ప్రే అని ఎటైనా వెళ్తావా? అని తల్లి తండ్రి అంటే అమ్మెా ప్రేమ అంటుంది..ప్రేమంటేనె భయం ఏర్పడింది..ఆడపిల్లను కన్నది కానీ తనలా కాకూడదని బాగా పెంచాలని నిర్ణయించుకున్నది..
అదండీ ప్రేమ సంగతి..
-ఉమాదేవి ఎర్రం