సంకల్ప బలం
సంకల్పం బలం ఉంటే ఏమైనా సాధించవచ్చు. ఒక మామూలు టీలు అమ్మే మోడీ ఈ రోజు దేశ ప్రధానిగా అయ్యాడంటే దానికి కారణం ఆయన సంకల్ప బలం. అలాగే ఒక పేద మత్శ్చకారుల కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు దేశ రాష్ట్రపతిగా అయ్యారంటే దానికి కారణం సంకల్ప బలం.
ఇలా చెపుతూ పోతే ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మెగాస్టార్ అయిన సినీ హీరో చిరంజీవి ఎదుగుదలకు కారణం ఈ సంకల్ప బలమే. ఒక చిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టిన అంబానీ ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్ధాపించారు. నేడు మన దేశ రాష్ట్రపతి కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక గొప్ప నేతగా ఎదిగింది సంకల్ప బలం వల్లనే.
అంతదాకా ఎందుకు మీరు, నేను కూడా ఈ సంకల్ప బలం వల్లనే విజయాలు సాధిస్తాము. ఒక ఆశయం పెట్టుకుని దాని
కోసం అహర్నిశలు పాటుపడే వారే సక్సస్ సాధించగలరు. అదే మనం విద్యార్థులకు నేర్పించాలి. సంకల్ప బలంతో
కొండల్ని పిండిచేయవచ్చు. సముద్రాల్ని తేలికగా ఈదేయ వచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దీక్షగా ముందడుగు
వేయండి. మీరు జీవితంలో విజయాలు సాధించండి.
– వెంకట భానుప్రసాద్ చలసాని