గీత
వెనుకటికి లక్ష్మణుడు..
గీత గీసి వెళ్తే..
సీతమ్మ గీత దాటి..
భిక్ష వేసి నానా కష్టాలు..
పడింది..
నేటి యువత కూడా..
పెద్దలు పెట్టిన గీతలు..
దాటి..
అలాంటి కష్టాలే పడుతున్నారు..
కానీ..
వాళ్లకు తెలియడం లేదు..
గీతలు దాటి కష్టాలు కొని..
తెచ్చుకుంటున్నామని..
హద్దులు మీరి పోతున్నామని..
తెలిసే లోపే జరిగేది జరిగి..
పోతుంది..
అయ్యే నష్టాలు అయిపోతున్నాయి..
అదండీ సంగతి!!!
-ఉమాదేవి ఎర్రం