స్త్రీ మనసు
అక్కడ కట్నం
తాళి కట్టింది..
బేరసారాలు..
బంధాలయ్యాయి..
పెట్టుబోతలే
ప్రేమను పంచుకున్నాయి..
మమతలు కరువైన మల్లెలు
మాలలై వేలాడుతూ దీనంగా చూస్తుంటే..
కిలకిలల మధ్య
పులినోటికి మేకనందిస్తూ..
వెనక తలుపు మూసుకుంది..
మనసులేని మంచం
కామంతో వెకిలిగా నవ్వింది..
తెల్లచీర భయపడింది
మడతలిప్పిన దుప్పటి
అస్తవ్యస్తంగా వేలాడింది..
మగతనం తృప్తి చెందింది..
వేడి చల్లారిన వళ్ళు అటు తిరిగింది
కలలు కన్నీళ్ళను నింపుకున్నాయి
అగరొత్తులు కాలి నుసిగా మారాయి
భరించలేని బాధ గది నిండిపోయి
గోడలు వెక్కివెక్కి ఏడ్చాయి
అక్కడ.. నలిగింది మల్లెలా…
కాదు.. కాదు…
అందమైన స్త్రీ మనసు…!!
-గురువర్ధన్ రెడ్డి