చరిత్రనుతిరగరాస్తే
ఆధునిక మహిళే
చరిత్రను తిరగరాస్తే
జగానికి వణుకు పుట్టదా.
నిజాలు బయటపడవా.
కీచకుల మదము అణగదా.
చరిత్ర అంతా రక్త చరిత్రే.
యుద్ధాల పేరుతో మగువల తాళి తెంపే ఒక రాక్షస క్రీడ.
పిల్లల తండ్రులను వారికి
దూరం చేసే పైసాచిక ఆనందం.
గెలిచిన రాజు రాయించుకున్న
అబద్ధాలే మన ప్రాచీన చరిత్ర. యదార్ధాలు వ్రాయాలి సుమా.
మనిషి చరిత్రను కొత్త కోణంలో
ఆవిష్కరించాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని