ఆక్రందన
చరిత్రను తిరగ రాసినా..
ఇప్పటి చరిత్ర అయినా..
రక్తపాతం తప్పడం లేదు..
ఏ చరిత్రలో నయినా..
చావడం చంపుకోవడం..
కనపడుతూనె ఉన్నాయి..
పుస్తకాలలో..
ఏ చరిత్ర పుస్తకాలలో చూసినా..
అన్యాయాక్రమాలు..
ఆడవాళ్ల ఆక్రందనలే వినిపించాయి..
పురాణాల్లో అయినా..
పుణ్యక్షేత్రాల్లో అయినా..
స్థ్రీలకు రక్షణ కరువే..
పురుషుల అహంకారమే!
చరిత్ర తిరగరాస్తే ఏంటి?
రాయకపోతే ఏంటి?
ఎప్పుడయినా అవే బాధలు..
ఎక్కడయినా అవే గాధలు..
ఎక్కడ స్థ్రీని పూజిస్తారో!
అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుందని..
చెప్పారు మహాత్ములు..
మరి జరుగుతుందా ? అలా?
కలికాలంలో ఇంకేం జరుగుతుంది?
జరగాలని దేశం సస్యశ్యామలంగా..
ఉండాలని నమ్మకం తక్కువే అయినా ఆశిద్దాం!!
ఆశించడంలో తప్పులేదు కదా!
-ఉమాదేవి ఎర్రం