ఊరు మారింది
మా చిన్నప్పుడు మా ఉళ్ళో ఎటు చూసినా చెట్లుండేవి.ఇప్పుడు ఇదివరకున్నన్ని చెట్లులేవు. ఊళ్ళో రైతులంతాఎడ్లు పెంచేవారు. పొలందున్నటం అంతా ఎడ్లే చేసేవి.ఇప్పుడైతే ఊరంతా వెతికినాఒక ఎడ్ల జత లేదు. అన్ని పనులకు ట్రాక్టర్ వాడుతూఉన్నారు. అందరూ సైకిళ్ళువాడేవారు. ఐదారు కిలోమీటర్లు కూడా నడిచే వెళ్ళేవారు.
ఇప్పుడు ఇంటికిఒక మోటార్ సైకిల్ ఉంది.ఇదివరకు వ్యవసాయం చేసేప్పుడు ఎరువులు, పురుగు మందులు తక్కువగా వాడేవారు. ఇప్పుడు విచక్షణారహితంగా పురుగు మందులువాడుతున్నారు. ఊరంతటకీ ఒక హాటలు కూడా ఉండేది కాదు. ఇప్పుడు చిన్నవి చాలా హాటల్లు వచ్చాయి.
ఆ రోజుల్లో సాయంత్రం పార్కులో రేడియో వింటూ పచార్లు చేసేవారు. ఇప్పుడు బయట పని అవగానేఇంటికి వెళ్లి టీవీకి కళ్ళు అప్పచెపుతున్నారు. ఊరంతటకీ ఒక్క టీవీ కూడాఉండేది కాదు. సాయంత్రం అయితే ఆరుబయట కూర్చుని
కబుర్లు చెప్పుకునేవారు.
అసలు ఇప్పుడు బయటకూర్చుని కబుర్లు చెప్పేవారులేనే లేదు. ఫోన్ ఊరంతటిలోఒకరిద్దరికే ఉండేది. అదీ ల్యాండ్ ఫోన్. వర్షాలు టైంకిపడేవి. వేసవి కాలంలో ఇప్పుడు ఉన్నంత ఎండలుఉండేవి కావు. మా చిన్నతనంలో ఊరంతటకీ
ఒక పది మంది కూడా మద్యపానం చేసేవాళ్ళు కాదు.వారు కూడా చాటుగా ఎక్కడో తాగి గుట్టచప్పుడు కాకుండాఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడుఎక్కువ మంది మద్యపానంచేయట మొదలుపెట్టారు.
ఇప్పుడు ఉన్నన్ని చిరుతిళ్ళుఉండేవి కాదు. బయట తిళ్ళుతినటానికి ఇష్టపడేవారు కాదు.నేను చెప్పేది నలభై ఐదు సంవత్సరాల క్రితం మాట.మనుషులు మారారు. ఊరు కూడా మారింది.
-వెంకట భానుప్రసాద్ చలసాని