* సి.నా.రె మనవారే *
Dr. సి. నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా.,
ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలతో ఆయనని స్మరించుకునే ప్రయత్నం…
సి.నా.రె గారి కవి మనస్సు గురించి చెప్పే వయస్సు, అర్హత, స్థాయి నాకు లేవు.,
ఎందుకంటే నేను పుట్టినప్పటికే ఆయన జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మహా కవి.,
ఆయన రాసిన పాటలు విన్నాను, ఆయన రచనలు కొన్ని చదివాను.,
ఆయన రాసిన ఎన్నో వేల రచనలలో, పాటలలో కొన్ని పాటలతో వారి కవి హృదయాన్ని స్మరించుకుంటు..
- నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, అని ఆయన తొలి సినిమా పాటతో తెలుగు సినీ శ్రోతల మనసులని దోచుకున్నారు., ఎన్నో సినిమాలకి ఆయనే సింగిల్ కార్డ్.,
అప్పుడు అనుకున్నారట అందరూ
- భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, అని.,
జాతుల, భాషయాసల ఔన్నత్యాన్ని
- ప్రాంతాలు వేరైనా, యాసలు వేరుగ ఉన్నా, మన అంతరంగమొకటేనన్నా, మన భాష తెలుగు భాషన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, అంటూ ఆయన అందరినీ ఒకటి చేశారు.,
అంతే కాకుండా మనం ఎలా కలిసి మెలసి వుండాలో కవి హృదయంతో పక్షులను ఉదహరింస్తూ
- రంగూ రూపు వేరైనా, తమ జాతి రీతి ఏదైనా, చిలకా కోయిల చేసిన చెలిమి, ముందు తరాలకు తరగని కలిమి.,
మనకు ఆయన పాటలలో, రచనలలో స్పురించేవి
- శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు.. అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు.,
సీతాదేవి బాధలు గురించి ఆయన ఓ పాటలో
- గుండే లేని మనిషల్లే నిన్ను కొండా కోనలకొదిలేసాడా, అగ్గిలోనా దూకి, పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒక నాడు..
స్నేహానికి ఉన్న విలువను ఆయన పాటలో.,
- స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. బాధలను ప్రేమించు భాయీ..లేదు అంతకు మించి హాయ్.,
ఆ సరస్వతీ దేవికే, ఆవిడ ఎవరో తెలిపారు ఆయన రచనతో
- సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, హే భారతి మనసా స్మరామి.,
అమ్మ మనసు గురించి ఆయన పాటలో
- కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.,
అమ్మని ఆరాధించమని ఆయన గజల్స్ లో
అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచ మంటె, నేను ఒరిగేను అమ్మ వైపు, అని స.నా.రె అనే సైన్ తెలుగు గజల్స్ కే పెట్టేలా రచించారు.,
ఇలా ఎన్నో వేల పాటలు, రచనలు, కవితలు రచించారు, మనల్ని రంజింప చేశారు.,
ఆయన పాటలలో, రచనల్లో గజల్స్ లో, ఆఖరికి మాట్లాడే మాటల్లో కూడా,
మానవీయ దృక్పథం, ప్రగతి సీలనం, మెత్తని అదిక్షేపన వుంటాయి.,
ఆయనకి వచ్చిన అవార్డులు, పురస్కారాలు ఆయన రాజసానికి అవి నీరాజనాలు, ఆయన కవిత్వం విన్న మనం ధన్యులం…
శ్రీ కిరణ్