సమాజపు పయనం
ఎన్నెన్నో అకృత్యాలు
ఎన్నెన్నో అరాచకాలు
జరగరాని ఘోరాలు
వినలేని నేరాలు
ఎన్నో రాజకీయ పార్టీలు
మరెన్నో కుతంత్రాలు
ఎన్నో హత్యలు మానభంగాలు
ఆధునికత పేరుతో అశ్లీల మెసేజ్లు
పబ్బుల్లో రేపులు ,మత్తులో మనుషులు
గమ్మత్తులు,వింతైన విషయాలు
అరో క్లాసు పిల్ల ఇంట్లోనే డెలివరీ చేసుకోవడం
ఆ పిండాన్ని సంచిలో దాచడాలు
తిరిగి ఏమి తెలియనట్టు ఉండడం
కారులో తిప్పుతూ రేపులు,
కొత్త వింతలు నాలుగో తరగతి పిల్లల
బ్యాగులో చూడకూడనివి చూడడం
వినకూడనీ మాటలన్నీ చిన్న పిల్లలతో
మాట్లాడించడం…
ఒకప్పుడు బయటకు రావడానికి కూడా
సంప్రదాయాలు ఈనాడు నచ్చడం లేదు
ఒకప్పుడు ఉన్న చీర ఇప్పుడు జీన్స్ గా
మారింది, వేసుకునే బట్టల లో మార్పు రావడం
సహజం. మంచిదే కానీ మనుషుల్లోనే మార్పు
ఇదేనా నవ సమాజపు పయనం? ఇదేనా నవ ఆధునిక
సమాజ పయనం ? ఎటూ వెళ్తోంది సమాజం ? ఏమై
పోతుంది మన సమాజం? మనమూ అందులో భాగమే గా
ఈ ప్రశ్న కి సమాధానము మనమే వెతకాలి, మనమే మన
రచన లతో సమాజ మార్పును కాంక్షిద్దాం. సమాజాన్ని మారుద్దాం .ఒక్కసారి కాకపోవచ్చు కానీ జరిగే తీరుతుందని
నమ్ముతూ…. జైహింద్
– భవ్యచారు