అందం

అందం

 

బెరుగ్గా బళ్లోకి అడుగుపెట్టింది సౌందర్య , కొత్త ఊరు కొత్త ఇల్లు కొత్త బడి, అందువల్లే సౌందర్య కి చాలా భయంగాను, కొత్తగాను ఉంది. సౌందర్య ఐదో తరగతి చదువుతుంది. ఇంతలో ఆమెను గమనించిన ఫ్యూన్ వచ్చి ఏమ్మా స్కూల్ కి కొత్త, మీ వాళ్ళెవరూ రాలేదా అంటూ అడిగాడు. లేదు తాత మా ఈ పక్కనే మా ఇల్లు నేనే వెళ్తాను అని అన్నాను అందుకే అమ్మ రాలేదు అంటూ చెప్పింది సౌందర్య.

అవునా ఈ ఊరి కొత్తగా వచ్చారా ఏమిటి అన్నాడు ఫ్యున్, అవును తాత మా నాన్నగారు కరెంటు ఆఫీసులో పని చేస్తాడు. మరి అమ్మేమో ఇంట్లోనే ఉంటుంది. మొన్ననే ఈ ఊరికి కొత్తగా వచ్చాము అంటూ చెప్పింది.

ఓ అవునా ఇంతకీ నువ్వు ఏ తరగతి అంటూ అడిగాడు. ఆరో తరగతి తాత అని అనగానే సరే పద నీకు క్లాస్ రూమ్ చూపిస్తాను. అంటూ తనని తీసుకొని క్లాస్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. అప్పటికే అక్కడ మాస్టారు గారు క్లాస్ చెప్తున్నారు. ఎవరో కొత్త అమ్మాయితో ఫ్యూన్ రావడంతో మాస్టారు గారు క్లాస్ ఆపి ఎవరిది రంగయ్య కొత్త అమ్మాయా అంటూ అడిగారు.

అవును మాస్టారు ఈరోజే వచ్చింది. హెడ్మాస్టర్ గారి దగ్గరికి నేను తర్వాత తీసుకొని వెళ్తాను ఇప్పుడు మాత్రం అమ్మాయిని క్లాస్లో కూర్చోబెట్టుకోండి అని చెప్పాడు రంగయ్య సరే నువ్వు వెళ్ళు నువ్వు రా పాప అంటూ పిలిచారు మాస్టారు గారు నమస్కారం మాస్టర్ గారు అంటూ పాప నమస్కరించింది.

పాప సంస్కారం చూసిన మాస్టారు గారికి ఎంతో ముచ్చట వేసి దగ్గరికి పిలిచాడు. ఏమ్మా నీ పేరేమిటి అంటూ అడిగాడు. నా పేరు సౌందర్య సార్ అంటూ చెప్పింది సౌందర్య.. ఆ మాటకి క్లాస్ లో ఉన్న మిగతా పిల్లలు అందరూ గొల్లున నవ్వారు.

నవ్వుతూనే ఉన్నారు. పాపం సౌందర్య తలదించుకుంది. అది చూసిన మాస్టర్ గారు కోపంగా పిల్లల వైపు చూశారు దాంతో అందరూ నవ్వు మానేశారు. కానీ ముసి ముసి నవ్వులు మాత్రం ఆగడం లేదు.

అది చూసిన మాస్టర్ ఆ పాపని తన టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్లి ఏంటి మీరందరూ ఎందుకు నవ్వారు. ఇప్పుడు అంటూ పిల్లలందరినీ అడిగారు. నిశ్శబ్దంగా మారిపోయింది ఎవరు సమాధానం చెప్పడం లేదు.

మాస్టారు గారు కోపంగా చెప్పండి ఎవరో ఒకరు ఎందుకు నవ్వారు. ఇప్పుడు అంటూ కోపంగా అడిగాడు. దాంతో ఒక అమ్మాయి బెరుగ్గా లేచి నిల్చుని తనకి సౌందర్య అని పేరు సూట్ అవ్వలేదు సార్ అందుకే మేము నవ్వాము అంటూ మళ్ళీ నవ్వింది.

అది విన్న మాస్టర్ గారు ఏమైంది సూట్ కాకపోవడానికి పేరు పాప చాలా బాగున్నాయి కదా అని అన్నారు. సార్ సౌందర్య అంటే ఎంతో అందంగా ఉన్నది అనుకున్నాము కానీ ఆమెను చూడండి నల్లగా ,పొట్టిగా, పళ్ళు  ఎత్తుగా ,జిడ్డు మొహంతో ఎలా ఉందో అందా అమ్మాయి.

ఓ అదా సంగతి అంటే సౌందర్యాన్ని పేరు పెట్టుకున్నంత మాత్రాన అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా అంటూ అడిగారు మాస్టారు గారు. దానికి అమ్మాయి తల అడ్డంగా ఊపింది. సరే నువ్వు కూర్చో సౌందర్య నువ్వు కూడా వెళ్లి కూర్చో అమ్మా అంటూ చెప్పి, వాళ్లు కూర్చున్న తర్వాత చూడండి అందమంటే మొహాన ఉండేదిశరీర అండం కాదు మనసు అందంగా ఉండాలి.

గుణం అందంగా ఉండాలి. మానవత్వం, జాలి ,దయ, కరుణ ఇలాంటివి ఉండగలిగితేనే మనిషి అందంగా ఉన్నట్టు అంతేకానీ బాహ్యంగా కాదు .అంతర్లీనంగా జాలి అనేది మనిషి చూపిస్తేనే అది అందం అని అంటారు అంతే తప్ప బయట కనిపించేదాన్ని అందమని ఎవరు అనరు.

ఇప్పుడు మీరంతా సౌందర్యం చూసి నవ్వారు మీరంతా అందంగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు. కానీ మీ ఎదుటి వాళ్లు కూడా మిమ్మల్ని చూసి ఇలాగే నవ్వితే మీకు ఎలా ఉంటుంది. ఒకసారి ఆలోచించి చూడండి. పిల్లలు అందం శాశ్వతం కాదు గుణం శాశ్వతం.

మనిషి చనిపోయేవరకు లోపు ఎన్ని మంచి పనులు చేశాడు అనేది ముఖ్యం. అంతేకానీ అందంగా ఉన్నాడా ,ఎంత సంపాదించాడు అనేది ముఖ్యం కాదు, అతను ఎంతమందికి సహాయం చేశాడు. అతను ఎన్ని దానాలు చేశాడు అనేది ముఖ్యం.

ఇప్పుడు మీరు అందంగా కనిపిస్తున్న పిల్లలు వేరే రకంగా ఉంటుంది., మీరు ముసలి వాళ్ళయిన తర్వాత మీ చర్మం ముడతలు పడి మన రంగయ్య తాత లాగా తయారవుతారు మన రంగయ్య తాత కూడా ఒకప్పుడు అందంగా ఉండేవాడు కదా ఇప్పుడు మీరు అతన్ని తాత అంటున్నారు.

ఎందుకు అంటే అందం తరిగిపోయి అతను ముసలివాడు అయ్యాడు రేపు నేను కూడా అలాగే అవ్వచ్చు ,కాబట్టి అందం అనేది శాశ్వతం కాదు. మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది. ఎంతమందికి సహాయం చేస్తున్నాం .ఎంతమందికి జాలీ, దయా ,కరుణ, అనేది ఉన్నాయి అనేదే ముఖ్యం.

సౌందర్య అందంగా లేకపోవచ్చు ఆమె మనసు మంచి స్వచ్ఛంగా ఉండొచ్చు, ఆ అమ్మాయికి జాలి, దయా,కరణ, గుణాలు ఉండొచ్చు ఒకరికి సహాయం చేసే గుణం ఉండొచ్చు రేపు పొద్దున మీరంతా చదువుకొని ఇక్కడి వారు అక్కడ వెళ్లిపోతారు ఎవరు ఎక్కడ ఉండి ఏం చేస్తారో ఎవరికి తెలియదు, కాబట్టి ఎప్పుడూ ఒకరిని తక్కువ అంచనా వేయవద్దు అలాగే అందాన్ని కూడా అంచనా వేయొద్దు.

*********

అందంగా ఉన్నవారు అందరూ మిస్ యూనివర్స్ లు కాలేరు. అలాగే అందంగా లేని వారందరూ మిస్ యూనివర్సల్ కావచ్చు , మీ లేత మనసులో ఇప్పటినుంచి అందం అంటే ఇది అనే ఒక నమ్మకం పాతుక పోతే అది పెరిగి పెద్దవుతుంది తప్ప తగ్గదు. కాబట్టి ఇప్పటినుంచి మీరు ఈ అందం అనేదానికి పట్టించుకోకుండా గుణం ముఖ్యం అనేది నేర్చుకోవడం మంచిది అందుకే మీకు ఈ విషయాలు చెప్పాను.

ఏమో రేపు పొద్దున సౌందర్య ఒక మంచి బిజినెస్ మాగ్నెట్ కావచ్చేమో, నలుగురికి సహాయపడవచ్చు ఏమో, ఆమె ఒక క్రీడాకారిని కావచ్చు ,లేదా సినిమా యాక్టర్ కూడా కావచ్చు, మీరందరూ కూడా ఎన్నో రంగాల్లో రాణించవచ్చు. ఈ సౌందర్య మీకు సహాయం చేసే స్థితిలో ఉండవచ్చు.

అందుకే పిల్లలు అందం అనేది మొహం తెల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉన్నట్టు కాదు. మనసు కూడా స్వచ్ఛంగా అందంగా ఉండాలి. తప్ప శరీరాన్ని కాదు అని మాస్టారు గారు చెప్పడంతో పిల్లలందరూ చప్పట్లు కొడుతూ లేచి నిల్చున్నారు.

నిజమే మాస్టారు గారు మేము సౌందర్య ను చూసి వెక్కిరించాలని అనుకున్నాం. ఆటపట్టించాలని నవ్వుకున్నాం, కానీ మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది. మేము మొదటి తరగతిలో ఉన్నప్పుడు రంగయ్య తాత మంచిగా ఉండేవాడు, ఇప్పుడు మేము ఆరో తరగతికి వచ్చేసరికి కొంచెం ముసలాడిలా తయారయ్యాడు. ముడతలు కూడా కనిపిస్తున్నాయి అందువల్ల మాకు అర్థమయింది.

ఇకనుంచి మేము సౌందర్యని గేలి చేయము మాస్టారు గారు అంటూ ముక్తకంఠంతో చెప్పారు పిల్లలు. సౌందర్య అందరి వైపు నవ్వుతూ చూసింది. అందరూ వచ్చి సౌందర్యను పలకరిస్తూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆ దృశ్యం చూస్తున్న మాస్టారు గారి కళ్లు ఆనందంతో మెరిసాయి….

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *