అణువణువు ఆయుష్షు
నువ్వు నేర్చిన పాఠం
అ – అమ్మ
ఆ – అవు అయితే
వాళ్ళు నేర్చిన పాఠం
అ- అడవి
ఆ – ఆయుధం
ఆశ లేని వారికి అడివే ఇల్లు
ఏ తల్లి సద్ది కట్టి పంపిందో
ఆ తూర్పున పూస్తున్న
ఎర్రని పువ్వులను చూసుకోమని
ఏ అయ్య నడక నేర్పిండో
ఆ అడుగులకు ఎర్రని
బాటలు వేయమని
ఏ అన్న ధైర్యం చెప్పిండో
ఫిరంగికైనా ఎదురు వెళ్ళమని
ఆశ వాళ్ళకి లేకపోవచ్చు
కానీ, ఆశయం వుంది
అది అణువణువు వాళ్ళకి
ఆయుష్షు పోస్తుంది
-విశ్వనరుడు