మానవతావాది
మానవత్వం మంట కలుస్తున్న
ఈ రోజుల్లో మానవతావాది ఎక్కడా నీ వెక్కడా ?
మానవత్వం మతం
అయిన రోజు
మనుషుల మధ్యన
అసమానతలు తోలగినరోజు
అణువణువునా స్వార్దం చేతులెత్తని రోజు
అగచాట్ల మేఘాలుమనిషినీ
కమ్మనిరోజు
అశాంతి అమలులులో
లేనిరోజు
అవినీతికి కాలం
చెల్లినరోజు
అసూయ ద్వేషాలు
అంతమైన రోజు
అనునిత్యం సంఘర్షణలు
పుట్టనిరోజు
నైతిక విలువలు
నశించని రోజు
మూఢనమ్మకాలు మూలన
పాడిన రోజు
న్యాయానికి ముందు
నిలబడిన రోజు
అజ్ఞానం వీడిన రోజు
మనుషుల మధ్య మానవత్వం పరిమళించిన రోజు
అనువైను చోటు మానవత్వానికి దొరికినట్టే
అప్పుడే మానవతావాది
కోసంవేచి చూసే అవసరం లేదు మరి
ప్రతి ఒక్కరిలో మార్పు
రానంత వరకు..
_జి జయ