నిరాకార రూపం ఓంకారమేనని!
గుడిలోని జంగమయ్య గుర్తెరుగవా…
బతుకంత చీకటిని బరువుగా మోసినా
తెగని బంధాలతో తెలవారలేదనీ…
భోదపడనీ జీవితాన భోదివృక్షమై నిలిచి
కొమ్మ కొమ్మన కోటి లతల ప్రాకారాలతో
మధురాన్ని నింపుటకు వెన్నెలై కదిలావా…
గుడిలోని జంగమయ్య గుర్తెరుగవా…
కర్మ చేసిన మనిషిగా బతుకెంతో చిన్నదని..
దోసిటా దొరికిన కష్టాన్ని సిరులుగా పండిస్తు
పలుకలేని ప్రతి బతుకున ప్రేమలను
పంచుకొంటు దినమెల్లనీ బతుకున దిక్సూచి
నీవని తనువంత దర్పణమై నీసేవలో దొరికినా
ఆనందాన్ని నిలువునా తాగుతున్నాము…
గుడిలోని జంగమయ్య గుర్తెరుగవా…
అడగనీ వారందరి చిలికినా ఫలితాన్ని
కంఠాన గరళంగ దాచావు…
దోయబడని సిరిగా తలపైన గంగమ్మను
కోరినంతనే నేలకు పంపావు…ఏడేడు
లోకాలను కలిపినా ఏకమైనా రూపంగ
కనబడుతు జాడ మరిచిన అభాగ్యులకు
మార్గమై నిలిచావు…
గుడిలోని జంగమయ్య గుర్తెరుగవా….
ఏ రూపాన కనిపించనీ
నిరాకార రూపం ఓంకారమేనని..
గాఢాంధ కారమున అరణ్యాన్ని దాటించే
తోడువు నీవేనని అవనిపై మొలిచినా
లింగరూపమై…ఏరుపారని బతుకున
ఏరువాకను పారించిన తొలకరి సందేశమై…
మనస్సుతో కొలిచేటి భక్తులకు కొండంత
బలమై అనువనువునా అకలింపుతో
దాసుడవై నిలిచావు…
గుడిలోని జంగమయ్య గుర్తెరుగవా….
-దేరంగుల భైరవ
చాలా బాగా వ్రాసారు