నా చిన్నతల్లి
పల్లవి
ఓ, నా చిన్న తల్లి… నా కథే చెప్తాను. వినవమ్మ
ఓ, నా చిన్న తల్లి… మా నాన్న గుండెల్లో… సిరి వెన్నెలను నేనమ్మ
ఓ, నా చిన్న తల్లి… మా అమ్మ రూపం నేనమ్మ
చరణం1
పది నెలలు… బరువు ఐయినా… ప్రేమతో నన్నే మోసిందమ్మ మా అమ్మే….
ఎన్నో కలలు కన్న… అమ్మ నాన్నల గుండెల్లో… మంటనే రేపి… వచ్చనమ్మ
చరణం2
నువ్వు కడుపున పడ్డాక… నన్ను మోసిన మా అమ్మే… గుర్తు వచ్చనమ్మ
నువ్వు కడుపులో… కాలుతో తంతుంటే… మా నాన్న గుండెలా మీద… ఆడుకున్న రోజులే… గుర్తు వస్తున్నాయమ్మ
చరణం3
నా చుట్టు పువ్వుల వణంలా… మీ నాన్న ప్రేమ ఉన్న… మదిలో… ఏదో దిగులు
నడక నేర్పిన నాన్ననే… చీకట్లోకి నెట్టేసి.. నీ నాన్న వెంట… వచ్చేశానమ్మ
చరణం5
కష్టం విలువే… తెలియకుండా పెచ్చారు, మా నాన్నే
నాన్న మీరే… నా వెంట లేకుంటే… నా నీడే నాతో రావడంలేదు?
నాన్న ప్రేమ కోసం…. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నామ్మ
చరణం6
ఊరుకో… నా చిట్టి తల్లి… నా బాధనే ఎవ్వరితో… చెప్పాను. నీకు తప్ప
నువ్వు చిన్ని చిన్ని… అడుగులు వేస్తూ ఉంటే… మురిసిది. ఈ తల్లి జన్మ
చరణం7
నువ్వే అమ్మ అని పిలుస్తుంటే.. నాకు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో… తెలుస్తుందమ్మ
మీ నాన్న.. నీ చుట్టు తిరుగుతూ… గరబామే చేస్తూ ఉంటే… నాకు మా నాన్నే… గుర్తు వచ్చనమ్మ
చరణం8
నేనే బుజ్జి బుజ్జి అడుగులు వేస్తుంటే… మురిసిందమ్మ మా అమ్మే…
నేను ఎదురు వెళ్తే… అదృష్టం నాది అనుకున్నాడమ్మ మా నాన్నే…
చరణం9
కాలు కింద పెడితే కందిపోతుందని… గుండెల మీద పెంచారమ్మ
ఆ ఆకాశంలో ఉన్న చంద్రున్నే… నా చుట్టు వెలుగులా…మార్చరమ్మ
చరణం10
అందాల కోటలో… యువ రాణిని నేనమ్మ
అందమైన గులాబీని నేను… నా వరకు ఏ ముళ్లు రాకుండా కపాడరమ్మ
నన్ను క్షణం కనబడకుంటే…. ఇండ్లు అంతా వెతికేవాడమ్మ మా నాన్నే…
ఇప్పుడు నన్ను చూడటమే లేదమ్మా
పల్లవి
ఓ, నా చిన్న తల్లి… నా కథే చెప్తాను. వినవమ్మ
ఓ, నా చిన్న తల్లి… మా నాన్న గుండెల్లో… సిరి వెన్నెలను నేనమ్మ
ఓ, నా చిన్న తల్లి… మా అమ్మ రూపం నేనమ్మ
-మంజుల
బాగా వ్రాసారు.