మంచి జరుగుతుంది
ఒక రోజు బ్రహ్మదేవుడు భూమిపై జరిగే విషయాల
గురించి నారద మహర్షితో
చర్చించసాగాడు. త్రిలోక
సంచారి అయిన నారద
మహర్షి తాను భూమిపై
చూసిన విషయాలను
బ్రహ్మదేవునికి వివరించి చెపుతూ ఇలా అన్నాడు
“మీరు సృష్టించిన మనిషే
మీరు సృష్టించిన ప్రకృతిని
నాశనం చేస్తున్నాడు. సమాజానికి కూడా నష్టం
చేకూరుస్తున్నాడు. సమాజం
ఎటూ పోతోంది. కొందరు చేసే తప్పుల వల్ల సమాజంలో
ఉన్న అందరికీ తీవ్ర నష్టం
జరుగుతుంది. దీనికి మీరే
పరిష్కారం చూపాలి”.
అప్పుడు బ్రహ్మ” నేను
మనిషిని సృష్టించిన
మాట నిజమే. నేను
మనిషికి విచక్షణా
జ్ఞానాన్ని అందించాను.
ఏది మంచో ఏది చెడో
తెలుసుకోగల శక్తి మనిషికి ఉంది. అయినా మనిషి తన
స్వార్థ బుద్ధితో సమాజానికి
నష్టం చేస్తున్నాడు. అలాంటి
సమయంలో మనిషికి మంచి చెప్పే ఒక సమూహాన్ని సృష్టించాను. ఆ సమూహం
తమ కధల ద్వారా, కవితల
ద్వారా సమాజానికి మేలుకొలుపు పాడతారు.
వారే అక్షర లిపి వారు.
తప్పకుండా సమాజం మారుతుంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు ” అని చెప్పారు.
బ్రహ్మ మాటలకు సంతృప్తి చెందిన నారద మహర్షి తన
భూలోక యాత్రకు శ్రీకారం చుట్టారు.
-వెంకట భానుప్రసాద్ చలసాని
అక్షరలిపి చదవండి. మంచి కధలు చదవండి.