ఇంటింటి రామాయణం లో ఒక భాగం

ఇంటింటి రామాయణం లో ఒక భాగం

 

*గతం తాలూకు నీడలు*
రాత్రి చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు ఆలోచనలతో,నేను మా వారి ఉద్యోగ రీత్యా విజయవాడలో ఉన్న సమయంలో మా ఇంటికి రెండిళ్ల అవతల ఒక రచయిత ఉండేవాడు అని తెలిసి *గతం తాలూకు నీడలు**
రాత్రి చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు ఆలోచనలతో,నేను మా వారి  ఉద్యోగ రీత్యా  విజయవాడలో ఉన్న సమయంలో మా ఇంటికి రెండిళ్ల అవతల ఒక రచయిత ఉండేవాడు. అతను చాలా గొప్ప రచయిత అని తెలిసి….

అతను ఎవరో, ఎంటో తెలుసుకోవాలి అనుకున్నాను.   తను ఎలాంటి రచనలు రాస్తాడు, ఏం రచనలు రాశారో తెలుసుకోవాలి అంకున్నాను. కానీ అసలే పెద్ద రచయిత.  అతను నాతో మాట్లాడుతారా…? అని అనుకుని , సరే చూద్దాం లే…. అనుకుని ఊరుకున్నాను.

నేను ఒకసారి కూరగాయల కోసం అని మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ  ఎవరో తమ ఫర్స్ కింద పడి ఉంది. అందులో వారి ఫోటో ఏమైనా ఉందా అని చూసాను. ఫొటో లేదు.  బ్యాంక్ కార్డ్స్ , డబ్బులు ఉన్నాయి. ఆ కార్డ్స్ పై ఒక అమ్మాయి ఫోటో ఉంది. కానీ సరిగా కనిపించడం లేదు.   తన పేరు నీలిమ అని ఉంది. అక్కడ ఆవిడ ఉందా అని చాలా చూసాను. కానీ అక్కడ ఎక్కడ చూసిన తను కనిపించలేదు.  తన అడ్రస్ చూసాను.  మా ఇంటి దగ్గరే వీరి ఇల్లు ఉంది. సరే వెళ్ళేటప్పుడు ఇద్దాం లే…. అనుకుని , కూరగాయలు  తీసుకొని ఇంటికి వెళ్ళాను.

ఆ తరువాత నీలిమ వాళ్ళ ఇంటికి వారి పర్స్ ఇవ్వడానికి  వెళ్ళాను. ఇల్లు చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళి, ఎవరైనా ఉన్నారా… అంటూ పిలిచాను. అప్పుడే ఒకావిడ బాధగా ‘  ఎవరూ….? ‘  అంటూ…  బయటకు వచ్చింది. ఇంతలో నేను నీలిమ అంటే….. మీరేనా..? అన్నాను. హా… నేనే… చెప్పండి అని తను అనింది. ఈ పర్స్ మీదేనా… నాకు మార్కెట్ లో దొరికింది అన్నాను. తను ఎంతో సంతోషంగా హా అవును నాదే , దీని కోసమే నేను చాలా బాధపడుతున్నాను.  అవునా… అయితే అందులో అన్ని ఉన్నాయో లేవో చూసు కొండి అన్నాను. హా అన్ని ఉన్నాయి. చాలా చాలా థాంక్స్ అండి . నాకు ఇందులో విలువైనవి ఉన్నాయి. అవి పోయాయి అని చాలా బాధపడి పోయాను. థాంక్యూ సో మచ్ అండి అంటూ తను నా రెండు చేతులను పట్టుకొని ఎంతో సంతోష పడుతుంది. అయ్యో ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి అంటూ నన్ను
లోపలికి తీసుకువెళ్ళింది.

కూర్చోండి… కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది.  అయ్యో అవేమీ వద్దు అండి అంటున్నా మీరు కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళి , కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. మీ పేరు ఏంటండీ… అంది. నా పేరు మధుమిత. హొ… చాలా బాగుంది మీ పేరు అంది నీలిమ. మీ ఇల్లు ఎక్కడ ,  నాకు పర్స్ ఇవ్వడం కోసం ఇంత దూరం వచ్చారు. అంది నీలిమ. అయ్యో అదేం లేదు , మా ఇల్లు పక్కనే. అన్నాను. అవునా ఇన్ని రోజులు మీరు కనపడలేదు అంది. మేము ఈ మధ్యే కొత్తగా ఇక్కడికి వచ్చాము. అవునా… అందుకే మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు అంది నీలిమ.  హ…. మీ ఇల్లు చాలా బాగుంది అండి అన్నాను. థాంక్స్ అండి అంది నవ్వుతూ… సరే ఇక నేను వెళ్తాను నీలిమ గారు అంటూ నిలబడ్డాను. అయ్యో అప్పుడే వెళతారా… అంది. ఇల్లు పక్కనే కదా! అప్పుడప్పుడు వస్తూ ఉంటాను , అలాగే మీరు కూడా మా ఇంటికి తప్పకుండా రండి  అన్నాను.  అలాగే అండి వస్తాను. ఇక్కడికి మీరు కొత్తగా వచ్చారు కాదా…! మీకు ఏం కావాకన్నా  నన్ను అడగండి.  అలాగే అండి థాంక్స్. అని బయటకు వచ్చాను.

కొన్ని రోజులకు మా ఇద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారింది.  ఒక రోజు నీలిమ మా ఇంటికి వచ్చి మధు అంటూ లోపలికి వచ్చింది. అప్పుడే నా కళ్ళు తుడుచుకుంటూ…. రా.. నీలిమ అన్నాను. ఎంటి…? ఏమైంది మధు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది.  నేను అదేం లేదు నీలిమ కంట్లో ఏదో పడింది అంతే అన్నాను. నువ్వు నిజం చెపుతున్నావా…, అబద్దం చెపుతున్నావా అని నాకు తెలీదా… ఏమైందో చెప్పు అంది నీలిమ. అదేం లేదు నీలిమ.. నువ్వు ఇలా కూర్చో నీకు టీ తీసుకొస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్లాను. నీలిమ నా వెనకాలే వచ్చిన సంగతి నేను చూడలేదు. నేను ఏదో ఆలోచిస్తూ టీ స్టవ్ పై పెట్టాను. టీ మొత్తం పొంగుతూ ఉంటే నీలిమ వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది. అయ్యో… చుస్కొలేదు నీలిమ అంటూ కంగారు పడ్డాను. ఆలోచనలు ఎక్కడో ఉంటే ఇక్కడ ఎలా చూస్తావు లే….  నేను టీ ఇప్పుడే తాగి వచ్చాను ఇప్పుడు నాకు ఏమి వద్దు. నువ్వు ఇలా రా…. ఇలా కూర్చో అంటూ నన్ను సోపా లో కూర్చో పెట్టీ , ఇప్పుడు చెప్పు… ఏమైంది… ఎందుకు అలా ఉన్నావు అంది నీలిమ. నీలిమని పట్టుకొని గట్టిగా గుండె లోని భారం మొత్తం దిగేలా ఏడ్చేసాను.

ఆ తరువాత న బాధ ను నీలిమ తో చెప్పడం మొదలు పెట్టాను.  నేను చదువుకునే రోజుల్లో నాకు కాబోయే భర్త కోసం అందరి అమ్మాయిల లాగే నేను కూడా చాలా కలలు కన్నాను. ముఖ్యంగా నన్ను బాగా చూసుకునేవాడు రావాలని ఆశ పడ్డాను. అనుకోకుండా నన్ను చూడటానికి అబ్బాయి వాళ్లు వాళ్లు వచ్చారు. చూడగానే నన్ను పెళ్లి చేసుకుంటానని అబ్బాయి ఒప్పుకున్నాడు.  అబ్బాయి కూడా బాగున్నాడు. మంచి జాబ్ ఉంది ఇంకేంటి అని మేము కూడా ఒప్పుకున్నాం.  పెళ్ళికి ముందు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మాటల మధ్యలో నా ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఎంత మంది, అమ్మాయిలు ఎంత మంది అని అడిగేవాడు. మామూలుగానే అలా అడిగాడు అనుకునేదాన్ని. తను ఫోన్ చేసినప్పుడు ఫోన్ బిజీ వేస్తే ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నావు అని అడిగేవాడు. నేను అప్పుడు అంతలా పట్టించుకోలేదు. మరి కొన్ని రోజుల్లో నా పెళ్ళి జరిగింది.

మొదటి రాత్రి అయ్యాక నేను కన్య నేనా కాదా అని పరిశీలించాడు. కానీ ఎటు వంటి సందేహం రాకుండా నా పై అతని అనుమానాన్ని కప్పి పుచ్చాడు. అతను ఆఫీస్ కి వెళ్ళాక నాకు పదె పదె  ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడిగేవాడు. అతను ఫోన్ చేసే ముందు ఫోన్ బిజీ వస్తే ఎవరితో మాట్లాడావని అడిగేవాడు.  అప్పుడు నా మీద ఉన్న ప్రేమతో అలా ఫోన్ చేస్తున్నాడు అని అనుకునేదాన్ని.  సాయంత్రం వచ్చాక నా ఫోన్ తో ఏదో పని ఉందని నా ఫోన్ తీసుకొని చూసేవాడు.

అతను ఆఫీస్ కి వెళ్ళే ముందు అతను వెళ్తూ ఉంటే  నేను  అతను వెళ్లే వరకు చూసి బై… చెప్పాలి అనుకునే దాన్ని. కానీ నేను వెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళమని చెప్పేవాడు. అప్పుడు కూడా నా మీద ప్రేమ తోనే అలా అన్నాడు అని అనుకునేదాన్ని.  రోజు వచ్చి నా ఫోన్  ఎందుకు చూస్తున్నాడు అని నేనే ఒకరోజు అతనికి తెలియకుండా తన వెనుకాల నిలబడి, నా ఫోన్ లో ఏం చూస్తున్నాడు అని చూసాను. నా ఫోన్ లో నా ఫోన్ కాల్స్ , మెసేజ్ బాక్స్ అన్ని చెక్ చేసి ఫోన్ పక్కన పెట్టాడు.  ఎప్పుడైనా ఏదైనా కొత్త నెంబర్ తో ఫోన్ వచ్చి ఉంటే ఆ నెంబర్ నీ తన ఫోన్ లోకి తీసుకొని ఆ తరువాత ఆఫీస్ కి వెళ్లి ఆ నంబర్ కి ఫోన్ చేసి వాళ్లు అమ్మాయి నా , అబ్బాయి నా అని తెలుసుకునే వాడు. ఒకసారి అలాగే నా ఫ్రెండ్ తన అన్నయ్య ఫోన్ నుండి నాకు ఫోన్ చేసింది.

మా ఆయన ఆ నంబర్ కి ఫోన్ చేసి తన తో మాట్లాడాడు. ఫోన్ లో అబ్బాయి మాట్లాడుతున్నా డని  వచ్చాక ఆ నంబర్ ఎవరిది అని నన్ను అడిగితే నేను నా ఫ్రెండ్ అని చెప్పాను. ఫ్రెండ్ అంటే అబ్బాయి ఆ, అమ్మాయి నా అని అన్నాడు. అమ్మాయి అనే చెప్పాను. కానీ ఫోన్ లో అబ్బాయి వాయిస్ ఎందుకు వస్తుంది అని గొడవ చేశాడు. ఆ తరువాత నంబర్ కి ఫోన్ చేసి , స్పీకర్ పెట్టీ మాట్లాడమని అన్నాడు. నేను అలాగే ఫోన్ చేసాను.  వాళ్ళ అన్నయ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను మధు నీ  ఫోన్ ప్రియకి ఇవ్వు అని అనగానే మధు చెల్లే నువ్వా సరే ఇస్తారా అని ఫోన్ నా ఫ్రెండ్ కి ఇచ్చాడు. అప్పుడు ప్రియ తో మాట్లాడాను. ఆ తరువాత మా ఆయన ఏమి అనలేదు. అప్పుడే నాకు అర్థమైంది. మా ఆయనకి నా మీద ఉన్నది ప్రేమ కాదు అనుమానం అని.

ఆ రోజు నుండి మా ఆయన  మొదలు పెట్టాడు నన్ను టార్చర్ పెట్టడం. ఆఫీస్ కి వెళ్లి అప్పుడప్పుడు మధ్యలో చెప్పకుండా ఇంటికి వచ్చేవాడు. ఆ టైమ్ లో నేను పడుకొని ఉంటే డోర్ తీయడం కొంచం ఆలస్యం అయితే ఇంత సేపు ఎం చేశావు డోర్ తీయడానికి ఇంత సేపా అని నా మీద అరుస్తూ., నా చీర , జుట్టు కొంచం నలిపితే అలా ఎందుకు నలిగాయి అని నన్ను తిట్టి ,  నేను లేని సమయంలో ఎవడు వచ్చాడు అని ఇంట్లో  మొత్తం  వెతికి, నేను వస్తున్నానని వాడిని బయటకు పంపించేసావా , అందుకేనా నీకు డోర్ తీయడానికి ఇంత టైమ్ పట్టింది అని నన్ను తిట్టి, కొట్టి హింసలు పెడతాడు. నా గుండెలు బాదుకుంటూ నా గుండె లోని భాదను ఎవరితో చెప్పుకోలేక , నలో నేనే కుమిలి పోతూ ఉండేదాన్ని.

ఇంటి ముందు పూలు అమ్మస్తే వాటిని కొని నేను తలలో పెట్టుకుంటే వాటిని చూసి వాటిని ఎవడు తీసుకొచ్చి ఇచ్చాడు అని , నన్ను కొట్టేవాడు.  ఎవరైనా కూరగాయలు  అమ్మేవాళ్లు వేస్తే కూరగాయలు తీసుకోడానికి ఇంత టైమ్ పట్టిందా, వాడితో మాటలు ఎందుకు అని అలా కొట్టేవాడు. తీసుకుంటే ఆడవాళ్ళ దగ్గర తీస్కో లేదంటే , ఆ కూరగాయలు నేనే తీసుకు వస్తానని తిడతాడు.

ఏదైనా షాప్ కి వెళ్తే అక్కడ ఎవరూ ఎవరూ నన్ను ఎన్ని సార్లు చూస్తున్నారో చూసి , ఇంటికి వచ్చాక వారికి నీకు ఎంటి సంబంధం , పెళ్ళి కాక ముందు వాడితో తిరిగే దానివా, ఇప్పటికీ తిరుగుతున్నావా అంటూ కొట్టేవాడు.  ఎప్పుడైనా కొత్త చీర కట్టుకొని రెఢీ అయితే ఎవడి కోసం రెడీ అవుతున్నావని  గొడవ చేసే వాడు.

ఒక సారి నేను ఆ ఆయన పడుకున్నప్పుడు అతని ఫోన్ చూసాను.  అందులో నేను నా ఫోన్ లో మాట్లాడిన మాటలు అన్ని రికార్డింగ్ లో ఉన్నాయి. అది చూసే వరకి నా ప్రాణాలు సగం పోయాయి. నా భర్త కి నా మీద ఇంత అనుమానమా…, అంతలా నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంత లా అనుమానిస్తునావని అడిగాను. నువ్వు ఎలాంటి దానివి అని నాకు ఎలా తెలుస్తుంది. అందుకే ఇలా రికార్డింగ్స్ పెట్టాను అయితే ఎంటి..? ఏదైనా బయట పడుతుంది ఏమో అని భయపడుతున్నావా?  అయిన ఇందులో ఏం లేవు అంటే నాకు తెలియకుండా ఇంకో ఫోన్ తో ఏమైనా మాట్లాడుతున్నావా… లేదంటే నేను వెళ్ళాక ఇంకో సిమ్ కార్డ్ వేసుకొని వేరే వాడితో మాట్లాడుతున్నావా అని గొడవ చేశాడు.

ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే  ఎక్కువ రోజులు ఉంటే ఎప్పడికి ఫోన్ చేస్తూ అక్కడ మీ పాత ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావా అని, ఇంటికి వెచ్చే వరకు  టార్చర్ పెడతాడు. నేను కవితలు రాస్తే  అవి ఎవడి కోసం రాస్తున్నావని ఆరా తీసి  తిట్టేవారు.  మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వేస్తే వారికి , నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని తెలుసుకొని, వారితో నేను ఎలా ఉంటానో అడిగేవాడు.

కొన్ని రోజులకు మా ఆయనకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చాము.  మొదట్లో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయన గొప్ప రచయిత అని తెలుసుకొని, అందుకే ఆ ఇంటికి వెళుతున్నావా అని గొడవ చేశాడు. అసలు అప్పటి వరకు నాకు తెలియదు మీ ఆయన రచయిత అని. నేను నీ కోసం మీ ఇంటికి వస్తున్నా అని  ఎంత చెప్పినా వినలేదు.   ఆ తరువాత నువ్వు మా ఇంటికి రావడం చూసి  అప్పటి నుండి నన్ను ఏమి అనలేదు.

ఏం చేసినా , ప్రతి దానిని భూతద్దం లో పెట్టీ ప్రతి విషయంలో నా భర్త నన్ను అనుమానిస్తునే ఉన్నాడు.

తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా.. మీ అభిప్రాయం తెలుపండి.

 

-భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *