కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు
శ్రమని దోపిడీ చేస్తూ
అణిచివేతకు గురిచేస్తున్న
ఈ ధగా కోరులని కిందకి తొక్కి
ఆశల బావుటగా కార్మికుల
హక్కు కోసం బుక్తి కోసం
పోరాటం చేసిన కర్శకులమని
విశ్వమంతటికి తెలుసు..!!
ఎరుపు దళంగా ఎర్రని దండుతో
ఎర్రని వస్త్రాలు ధరించి
ఎరుపు సూర్యుడివోలె కిరణాలను
విరజిమ్మి ఎర్రటి నెత్రురు
కిందికి కాలువలే కారుతున్న
ఉద్యమ స్వప్నంగా దివికేగసిన
శ్రామికులమని
విశ్వమంతటికి తెలుసు
అందని ఆశలకు
అలుపెరగని
ఆలోచనలకు మధ్య సాగే
ఈ జీవన గమనంలో
ఆకలి పోరాటం కోసం
ప్రమాదం అంచున శ్రమిస్తున్న
శ్రామిక కార్మికులమని
విశ్వమంతటికీ తెలుసు…!!
ఆందోళనకూ, ఆవేదనకూ
సంపద అతీతం కాదు
ఆశలకూ, ఆనందాలకూ
గళమెత్తి స్పష్టం చేస్తూ
శ్రామిక శక్తిని చాటే
కార్మిక శక్తులము అని
విశ్వమంతటికీ తెలుసు…..!!
– పోతగాని శ్యామ్ కుమార్