క్రిమినల్ఎవరు
నగరంలోనే పెద్ద వ్యాపారవేత్త మణి కనపడటంలేదు. రెండురోజుల నుండి అతని ఫోన్స్విచ్చాఫ్ చేసి ఉంది. ఆయనకుటుంబ సభ్యులకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. మణి తానుబొంబాయి వెళతానని మాత్రం చెప్పి వెళ్ళాడు. ఇంతవరకు ఆయన గురించి ఆచూకీ లేదు.కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఆ
ఫిర్యాదు చేసిన తర్వాత వారుకూడా వెదకటం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేదు.
వ్యాపార ప్రత్యర్ధులు ఆయనను కిడ్నాప్ చేయించారని కొందరు భావించారు. కొందరైతేఆర్థిక లావాదేవీల్లో తేడావచ్చి ప్రత్యర్ధులు ఆయన్నిచంపించారు అని చాలామంది భావించారు. ఫోన్స్విచ్చాఫ్ చేసి ఉంది. ఎక్కడఉన్నాడో తెలియటం లేదు.పోలీసు టీం బొంబాయి వెళ్ళింది. ఇక్కడ కుటుంబ సభ్యులైతే పోలీసులకు కొందరు అనుమానితుల పేర్లుఇచ్చారు.
వారందరినీ పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించారు పోలీసులు.వారి వద్ద కూడా మణి గురించి సమాచారం లేదు. మణి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారికి ఒక అనుమానంవచ్చింది. మణి గురించిఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు. ఎంక్వైరీలో బయట పడిన విషయాలు అతనికిఆశ్చర్యం కలిగించాయి. మణిపెద్ద వ్యాపారస్తుడే కానీ అప్పులు కూడా చాలా ఉన్నాయి. ఆ అప్పుల వాళ్ళు అప్పు తీర్చమని మణిపై వత్తిడి తెస్తున్నారు.
ఈ మధ్య వ్యాపారం దెబ్బతిని నష్టంవచ్చింది. మణికి ఆస్తులు ఉన్నా కూడా అప్పులు తీర్చేందుకు చేతిలో డబ్బులేదు. అందుకే అప్పులిచ్చిన వారు వత్తిడి చేయటంతో మణి ఇలా నాటకం ఆడడం జరిగిందిఅని ఆ పోలీసు అధికారి గ్రహించాడు. ఈ నాటకంలోమణి కుటుంబ సభ్యులపాత్ర కూడా ఉందని తెలిసింది.
పోలీసులు మణి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విచారించగా విషయం బయట పడింది. మొత్తానికి సస్పెన్స్ వీడింది.
-చలసాని వెంకట భానుప్రసాద్
కధ చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.