సినారె
కవితలతో కవ్వించే’సినారె’
సాహిత్యంతో మరిపించే’సినారె’
కావ్యాలతో మురిపించే’సినారె’
గజళ్ళతో మైమరిపించే’సినారె’
నాటికలతో నవ్యత్వాన్ని చూపించే’సినారె’
వచనాలతో వర్షించే’సినారె’
సంవచనాలతో హర్షించే’సినారె’
సినారె!
పద్యాలతో పదనిసనలు పలికించే’సినారె’
గద్యాలతో గమనికలు తెలిపే’సినారె’
కవితాంశతతో తెలుగుని వెలిగించే’సినారె’
సంగీతాంశతో వెలుగై జ్వలించే’సినారె’
విద్యావేత్తగా విలువైన విద్యనందించే’సినారె’
సరికొత్త సాహిత్య ప్రక్రియలతో జోలపాడే’సినారె’
సినారె!
అస్థిత్వంతో అలరించే’సినారె’
వ్యక్తిత్వంతో శక్తిగా ఎదిగే’సినారె’
వక్తృత్వంతో మానవత్వాన్ని మలిచే’సినారె’
ప్రాచీన ఆధునిక ఆంధ్రసాహిత్యాన్ని పఠించే’సినారె’
ఆధునికాంధ్ర కవిత్వాన్ని విమర్శించే’సినారె’
అన్యభాషల సాహిత్యాన్ని శోధించే’సినారె’
సినారె!
సినీగీతాలతో ప్రేక్షకులని అలరించే’సినారె’
బహుముఖ ప్రజ్ఞాశాలి గా వెలుగొందే’సినారె’
సాహిత్య పద్మాలతో పద్మశ్రీ ని పొందే’సినారె’
‘విశ్వంభర’తో ‘జ్ఞానపీఠ్’ని అందే’సినారె’
సాహిత్యానికే జీవితాన్ని అంకితం చే’సినారె’
సౌమనస్య జీవనాన్ని ఎంపిక చేసే’సినారె’
సౌజన్య కీర్తిని అధిరోహించే’సినారె’
సాహిత్యలోకాన్ని వదిలి అకస్మాత్తుగా దివికెగ’సినారె’
తెలుగు ప్రజల గుండెల్లో శోకాన్ని నింపే’సినారె’
తెలుగు ఉన్నంతకాలం మిమ్మల్ని మరువలేం “సినారె”
సినారె నామం కవిత్వం
సినారె స్వర్గధామం చైతన్యం
సినారె హృదయం ఓ ఉదయం
సినారె తేజస్సు ఓ తపస్సు
సినారె వయస్సు ఓ ఛందస్సు
సినారె ఓర్పు సంధ్యా తూర్పు
సినారె మార్పు తిరుగులేని తీర్పు
సినారె తీరు సమ్మోహన భావాల హోరు
సినారె వచనం బహువచనం
సినారె కధనం బాహు బంధనం
సినారె వదనం చంద్ర నందనం
సినారె సదనం సాహిత్య వందనం
(డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు)
-కిషోర్ రెడ్డి
చాలా గొప్పగా చెప్పారు పెద్దాయన గురించి.