మెళకువ

మెళకువ

 

వర్షం కురవటమంటే
ఆకలిగొన్న నేలకు
ఆకలిముద్దనందించటం
అదో బాధ్యతనుకుంటుంది నింగి

ఆ చినుకు ముంచెత్తిందా
దండించిందని అర్థం
నేలెప్పుడు నింగి ముద్దుల కూచే
కానీ భయాన్ని దిద్దుతుంది అప్పుడప్పుడు

మనుషులవి కనిపించే ప్రేమలు
ప్రకృతిది కనిపించని దీవెన
డీకోడ్ చేశామా
అణకువతో మెళకువలో ఉంటాం.

-సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *