ఆయన ఎవరు
కాలేజీ వార్షికోత్సవం జరుగుతోంది. విద్యార్థులంతాహడావుడిగా తిరుగుతున్నారు.కాలేజీ ప్రిన్సిపాల్ చాలా టెన్షన్ పడుతున్నారు. ముఖ్య అతిథిసమయానికి రాలేదు. కాలేజీవార్షికోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిన సమయం
ఆసన్నమైంది. ముఖ్య అతిథిదారిలో ఉన్నారు.
కాలేజీకి రావటానికి గంట సమయం పట్టేటట్లు ఉంది. ప్రిన్సిపాల్ గారికి టెన్షన్ పెరిగిపోతోంది.అందరూ వచ్చేసారు. మరీముఖ్యంగా మినిస్టర్ గారువచ్చేసారు. మినిస్టర్ గారు గంటలో మరొక ముఖ్యమైనకార్యక్రమానికి వెళ్ళాలి. కార్యక్రమం లేట్ అవ్వకూడదు.
లేటయితే ప్రిన్సిపాల్ గారికి కాలేజీ మేనేజ్మెంట్ వారితోఇబ్బంది. ప్రిన్సిపాల్ గారికి రక్తపోటు పెరిగిపోసాగింది.తన పరిస్థితి ముఖ్య అతిథికి ఫోన్ చేసి చెప్పారు.అప్పుడే ఒక వ్యక్తి కారులో సభా ప్రాంగణంలోకి వచ్చాడు. ప్రిన్సిపాల్ వద్దకు వెళ్ళాడు.ఆయన చెవిలో ఏదో చెప్పారు.ప్రిన్సిపాల్ భయపడుతూనేఆయన మాటలకు ఒప్పుకున్నారు.
ఆయన్ని ముఖ్య అతిథిగా సభకి పరిచయం చేసారు. ఆవిధంగా కార్యక్రమంమొదలయింది. సాంస్కృతికకార్యక్రమాలు అయ్యేలోపు ముఖ్య అతిథి వచ్చేసారు.ఆయన ప్రిన్సిపాల్ గారికి
ఆడిటోరియం బయట నుండి ఫోన్ చేసారు.
అప్పటివరకుముఖ్య అతిథిగా స్టేజ్ పై ఉన్న వ్యక్తి నిదానంగా బయటకు వెళ్ళిపోయాడు. ముఖ్య అతిథివచ్చి స్టేజ్ పై కూర్చున్నారు.ఆయన తన స్పీచ్ ఇచ్చారు.కార్యక్రమం విజయవంతం అయ్యింది.
ప్రిన్సిపాల్ గారిటెన్షన్ తగ్గింది. అసలు ఏమి జరిగిందంటే ముఖ్య అతిథిగారి తమ్ముడు అదే ప్రదేశంలో
ఉంటున్నారు. ఎప్పుడైతే ప్రిన్సిపాల్ టెన్షన్ పడుతూ తనకు ఫోన్ చేసారో ముఖ్య అతిథి తన తమ్ముడికి ఫోన్ చేసి తను వచ్చేవరకు తనస్ధానంలో కూర్చుని తానువచ్చేవరకు మేనేజ్ చేయమనిచెప్పారు.
ఆయన వేసుకున్న డ్రెస్ కలర్ కూడా చెప్పాడు.ఆయన కొంచెం ముఖ్య అతిథి పోలికలతోనే ఉంటారు. ఆయన అలాంటి డ్రెస్ వేసుకుని సభకు వెళ్ళి పరిస్థితి మేనేజ్ చేసాడు.మొత్తానికి సభ విజయవంతంఅయ్యింది.
మొదట ముఖ్యఅతిథిగా వచ్చిన వ్యక్తి నకిలీ అని సభలో ఎవరికీ తెలియదు.ఒక్క ప్రిన్సిపాల్ గారికి మాత్రమేతెలుసు. ఆ విషయం ప్రిన్సిపాల్ ఇంకా ఎవరికీ చెప్పే అవకాశం లేదు. మొత్తానికి అదో సస్పెన్స్ సంఘటన.
-వెంకట భానుప్రసాద్ చలసాని