పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
దివ్యమైన ఖురాన్
దివినుండి భువికి వచ్చినరోజే రంజాన్,
అందరిని ఆదరిస్తూ
పొరుగువారిని ప్రేమించే పండగే రంజాన్,
సత్యమార్గం అనుసరిస్తూ భక్తిమార్గంలో నడవమని చెప్పేదే రంజాన్,
ఉపవాస దీక్షతో వ్యామోహం,
మానసిక సంక్షోభం నుండి శాంతిని ప్రసాదించేదే రంజాన్,
సంకుచిత భావాలే దుఃఖకారకాలనీ తెలియచేసే అల్లాహ్ భోదే రంజాన్,
కర్తవ్యాన్ని భోదించి అజ్ఞానాన్ని తొలగించి జీవన ధర్మాన్ని ప్రభోదించేదే రంజాన్,
పంచుకునేటి ప్రేమలే పెంచుకునేటి సంపాదలని చెప్పేదే రంజాన్,
దౌర్జన్యం, రాక్షసత్వం రూపుమాపే
మమతల పండగే రంజాన్,
అహంకారపు అంతరంగాన
వివేక ప్రవచనమే రంజాన్,
మానసవీణా రాగాలాపనలో
భగవత్ తలపు ప్రేరితమే రంజాన్,
ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రసాదిత
అమృతపు వేడుకే రంజాన్,
భువిని దివిగా మార్చే ప్రేమాపాశపు పర్వదినమే రంజాన్.
-గురువర్ధన్ రెడ్డి