కరివేపాకు
కాంతమ్మ ఏం చేసిందో తెలుసా?
కరివేపాకు చెట్టు కొట్టేయించింది..
ఎందుకను కుంటున్నారా?
ఇంటి పక్క వాళ్లు ఇంటి వెనుక వాళ్లు..
అడుగుతున్నారని కాదండోయ్!
అడిగిన ఆడవాళ్లందరికీ వాళ్లాయన..
కోసిస్తూ కొంటెగా చూస్తున్నాడని..
చూసిన వాళ్లందరూ ఆయనని..
ముంచేస్తున్నారని..
దానికంతా కరివేపాకు చెట్టే..
కారణమని..
కోపంతో కొట్టేయించింది..
మహిళా! మజాకా!!
-ఉమాదేవి ఎర్రం