వారసత్వ సంపద
వారసత్వం అంటే మనుషులే కాదు దేశ జాతి సంపదే అసలైన వారసత్వ సంపద
దేశ ఔన్నత్యం గొప్పతనం చూపే ప్రతి ఒక్కటి వారసత్వ సంపదే
అద్భుత కట్టడాలు అందులో దాగిన ప్రత్యేకతలు నిగూఢమైన దాగిఉన్న నాగరికత
వైవిద్యమైన చరిత్ర
అబ్బురపరిచే సాంస్కృతిక సంపద
విలువైన కళాఖండాలు
ఆలోచింపజేసే విభిన్న పద్ధతులు
విభిన్నమైన కళారూపాలు అంతుచిక్కని నైపుణ్యం
మానవజాతి జవసత్వాలు
అవి ప్రగతికి సోపానాలు
సిరులు పండించే జల సంపద
అద్భుతమైన అటవీ సంపద
తరగని భూగర్భ సంపద
అన్నీ కాపాడుకోవాల్సినవవే మనిషి
అపూర్వమైన జాతి సంపదను అనంత కీర్తిని ఆపాదించే మన ఘనచరిత్ర కీర్తిని కాపాడు కోవడం అందరి ముందున్న కర్తవ్యం ..
– జి. జయ
కరెక్టుగా చెప్పారు.