ఆపన్నహస్తం
ఖాదర్ ఒక పెద్ద వ్యాపారస్తుడు.అతని దగ్గర అపరిమితమైన సంపద ఉంది. అయినా లోభగుణం కలిగి ఉండటం వలన ఎవరికీ ఆర్థిక సహాయం చేయడు. అలాంటి ఖాదర్ఒక మధ్యాహ్నం పూట నమాజు చేద్దామని మసీదుకు వెళ్ళాడు. అసలే ఎండాకాలం,పైగా ఉపవాసం చేస్తుండటంవల్ల కళ్ళు తిరిగి పడిపోయారు.అలా బండిమీద వెళుతున్నఖాదర్ పడిపోవటం చూసిఆ చుట్టుపక్కల ఉన్న వారంతావచ్చి అతన్ని హస్పిటల్లో చేర్పించారు.
హాస్పిటల్ బెడ్ పై సృహలోకి వచ్చిన ఖాదరుకుకుటుంబ సభ్యులు అసలుజరిగిన విషయం చెప్పారు.చుట్టుపక్కల వాళ్ళు చేసినసాయానికి ఖాదర్ కళ్ళు చెమర్చాయి. అప్పుడే అతనికిఅంతకు ముందురోజు జరిగిన
సంఘటన గుర్తుకు వచ్చింది.చుట్టుపక్కల వాళ్ళంతాకాలనీ అభివృద్ధి చేయటంకోసం ఖాదర్ గారిని చందాఅడిగారు. ఖాదర్ ఇవ్వటానికినిరాకరించారు. అదే వ్యక్తులుఈ రోజు ఖాదర్ గారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు.
వారుఖాదర్ చేసిన అవమానాన్ని మరచి అతనికి సహాయం చేయటం కోసం వచ్చారు.ఇది చాలా గొప్ప విషయం.ఒకవేళ వారు కనుక సరైన సమయంలో స్పందిచకపోతేఅనర్ధం జరిగిపోయేది.ఈ సంఘటనతో ఖాదర్ గారికి కనువిప్పు అయ్యింది. అప్పటినుంచి ఇతరులకు ఆర్థిక సహాయం చేయటంమొదలుపెట్టారు ఖాదర్.దానం చేస్తే సమాజంలో ఉండే ప్రజలు ఆశీర్వదిస్తారు.
-వెంకట భానుప్రసాద్ చలసాని
ఒకరికి ఒకరు తోడుంటేనే జీవితం బాగుంటుంది.