కూటమి
ప్రపంచంలో
నాటో కూటమి నాటిన యుద్ధం…
వార్సా ఒప్పందంలో ఒదిగిన యుద్ధం..
ఉక్రెయిన్ లో
వ్యూహ ప్రతి వ్యూహాలు….
జరిగినవి
రెండు ప్రపంచ యుద్ధాలు
ఎటూ తేలని అంతర్భాగ భూభాగాలు….
తైవాన్, ఉక్రెయిన్ ల
భూభాగాలలో చైనా, అమెరికా, రష్యాలు….
అవి ప్రపంచాధిపత్య అహంకార ధోరణులు….
యుద్ధం కోసం
యుద్ధం ఎంతో ముచ్చట పడుతుంది…..
మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానిస్తోంది ఆగలేక.
– విజయ్ కుమార్