ప్రేమో, పిచ్చో. ? ధారావాహిక- మొదటి భాగం
ప్రేమ వెతికితే దొరికేది కాదు మనల్ని వెతుక్కుంటూ వచ్చేది…అలా వచ్చిన ప్రేమ కూడా ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం అది ప్రేమ అని తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టిద్దో చెప్పలేం చివరికి ఆ ప్రేమ మనల్ని వద్దు అని వదిలి వెళ్ళిపోతే దాన్ని అంగీకరించి మర్చిపోవడానికి ఎన్ని రోజులు పట్టిద్దో…. ఇదంతా… జరుగుతూ ఉన్నప్పుడు తెలిస్తుంది ప్రేమ ఒకరి వైపే ఉంటుందని …….ఇప్పుడు నేను చెప్పే ప్రేమ కథలో ప్రేమ ఎక్కువ అని చెప్పలేను తక్కువ అని చెప్పలేను భరించలేని భాధ మాత్రం ఎక్కువే ఉంది అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేను……
ఈ కథలో అబ్బాయి పేరు …నానీ…..అమ్మాయి పేరు….శ్రీ…….కథలో అబ్బాయి కి కోపం ,ముర్కత్వం ,ఆవేశం అలాంటివి కొంచం ఎక్కువే …..అమ్మయి తెలివైంది కాని కొంచం పిచ్చిది….ఇది అనిపిస్తే అది మొహం మీద అనేస్తూ ఉంటుంది….
ఇంకా కథలోకి వెళ్తే….అమ్మాయిది…అబ్బాయిది….
ఇద్దరిది ఒకే ఊరు కాని పెద్దగా పరిచయం లేదు….ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు…కాని ఎప్పుడూ ఎవరు ఎలా కలుస్తామో తెలీదు కదా…. శ్రీ చిన్నప్పుడే నాని ని చూసింది….నాని కూడా శ్రీ ని అప్పుడే చూసాడు నాని ఒకరోజు మొదటిసారి బండి నడపడం నేర్చుకుంటున్నాడు అదే రోజు శ్రీ తన నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు…నాని బండితో యాక్సిడెంట్ చేసాడు శ్రీ ని తరవాత ఎం జరిగిందో శ్రీ కి కూడా తెలీదు శ్రీ కళ్ళు తెరచి చూసే సరికి ఆసుపత్రి లో ఉంది ఎం జరిగిందో తెలీదు తరవాత అర్ధం చేసుకుంది తనకి యాక్సిడెంట్ అయ్యింది అని …. ఆరోజు ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాక చుట్టు పక్కన వాళ్ళు చూడడానికి వస్తున్నారు పెద్దగా గాయాలు అయ్యాయి కాని ప్రమాదం ఎం లేదు…. ఆరోజు
రాత్రి నాని తన నాన్న గారితో కలిసి శ్రీ ఇంటికి వచ్చాడు శ్రీ ని చూడడానికి ఎలా ఉందో అని అదే మొదటి సారి శ్రీ నాని ని చూడడం …….
-రమ్య