చూపే బంగారం
పలికేదైవం నాకైతే అతను
నీరసించడు నిదానించడు
నిత్యసంచారి నిత్యచైతన్యశీలి
పద్ధతిగా ఉంటూ పద్ధతి నేర్పుతాడు
వసుధైక కుటుంబానికి నిజమైన ప్రతినిధి
ఇందుగలడందులేడని సందేహము వలదని ఒట్టేసి చెబుతాడు
కార్మికుడిలా పనిగంటలు పాటిస్తాడు
నీ జీవితం నీకుందంటూ మరోదిక్కుకు సాగిపోతాడు
కనిపించని కాలచక్రం కాల్చుకుతింటుంటే
కనిపించే కర్మసాక్షి కదా అతను
కష్టాల ఎగుడు దిగుడులతో
జీవితం కూరుకుపోతుంటే
స్ఫూర్తి కెరటమై చేయందిస్తాడు
అది చూసే చూపే మనకు దొరకదు
-సి.యస్.రాంబాబు
మీ రచన బాగుంది