ఆ నగరంలో
*****
ఆ..నగరంలో అక్కడ కొన్ని ఉదయాలు అప్రమత్తంగా మెలుకుంటాయి
బతుకు పరుగులాట ఇరుసు
చట్రంలో కాలానికి చక్రాలు కట్టుకొని
బతుకు కూర్చికి ఉద్యోగమై
వేలాడటానికి బయలుదేరుతాయి
చాలి చాలని జీతాలతో
నిరుత్సాహపు సంద్రంలో ఈదుతాయి
అక్కడ కొన్ని సాయంత్రాలు
నిర్దాక్షిణ్యంగా నిద్రపోతుంటాయి
అలసిన దేహలు కష్టపు
స్వేదం చమురుతో సర్కార్
దీపాన్ని వెలిగించడానికి
లైన్ కడుతుంటాయి…!
కొన్ని రాత్రులు ఎవరికి సెలవు
చెప్పకుండా మృత్యు పత్రంపై
నెలకోరుగుతుంటాయి
నగర శివారులో నిర్మానుష్యపు
దారుల్లో కన్నీటి అర్ధగానమై
గుండె పగిలి రోధిస్తుంటాయి
అక్కడ ఆ రాత్రి అంత నిద్ర పోయినట్లు నిశ్శబ్దం ధ్యానిస్తున్నట్లుంటుంది
కానీ ఆకలి చూపుల అన్వేషణ వేట
పైట జారేలా పక్కకు పిలుస్తుంటుంది
ఆ కుడలిలో పేదరికం విధి దీపాల
కింద దీపావళి శోభ సంచారించుకుంటుంది
అక్కడ బిడ్డ ఆకలికి పాలిచ్చే స్థన్యలపై
వీధి రాభందుల చూపుల గాలం మాటు
వేస్తూ కాలక్షేపం చేస్తుంటది
అక్కడ ప్లబ్ లు క్లబ్బులు భూలోక
స్వర్గానికి ఆనవాళ్లుగా ప్రతిబింబిస్తాయి
అక్కడ ఆ రాత్రి
కొన్ని జీవితాలు వ్యసనాలకు
బానిసలుగా సోలుతుంటాయి
కొన్ని జీవితాలు విధి ఆట
పాచికలుగా జూదంలో రమిస్తుంటాయి
మరి కొన్ని జీవితాలకు ఆ రాత్రి
సరస సరదాలకు నిలయమవుతుంటాయి..!
-సైదాచారిమండోజు