కాలం
నిన్నటి నే కదా నేను
మరి రేపటికి ఏమౌతాను
మరపునా…గతాన్నా!!
రేపు నిస్సహాయంగా
చూస్తుంది నన్ను… నేను ఏంచెప్తానో!! చేస్తానో తెలియక….
నేనేమో!!
బ్రతుకు కుంచె తో చిత్రం వేస్తున్నానని
చెప్పాను ఆగిపోమ్మని…
ఆగిపోతే బాగుండు ..
కానీ నాకోసం ఆగదు….
ఎందుకంటే దాని ఆయుష్షు
నేను ఉన్నంతవరకని చెప్పి
వెళ్ళింది.
నా మాట వినకుండా నే..…
-గురువర్ధన్ రెడ్డి
రచన బాగుంది.