కాలం విసిరిన తర్వాత
ఎందుకో అద్దంలో
నా నేరిసిన
సగం బట్ట తెల్ల జుట్టు
పరిశీలనగా చూసుకున్న
ఒక్కసారి ఆ జ్ఞాపకాల
లోతులోక్కి మునకేసా
ఒకట రెండా
ఎన్నో ఎన్నో
తలచి చూస్తే అనుభవం
తెరచి చూస్తే జ్ఞాపకం
మందు చిందు హంగు
మత్తు మగువ మల్లె
గూబలింపు సింగు పొందు
ఒక్కసారిగా
కాలం వ్యంగ్యంగా
నన్ను చూసి
చమత్కారిస్తూ
ఇది నువేనా అన్నట్లు
నవ్వుతూ ప్రశ్నిస్తుంటే…?
నిట్టూర్పు నిర్వీర్యంతో మౌన
ప్రదర్శనతో తలవాల్చా
యవ్వనమంతా
నేను నేను
అనే గర్వంలో
నువ్వెంత అన్న ఇదిలో
ఉక్కు కండలతో
దేహ దాడుర్యంతో
విర్రవీగిన నేను
ఇప్పుడు
ముసలి ముడతలతో
అరిగిన మోకాలు చిప్పల
కుంటి నడకలతో
సన్నగిల్లిన చూపుతో
ఒక మూలన బుక్కెడు
బువ్వకై ఎదురు
చూపుల నిరీక్షణ
కసురు మాటల విసురు పళ్లెపు
శబ్ద రణగోలల మధ్య
జీవన యాత్ర గడుపుతుంటే
ఇది నువేనా అన్నట్లు, కాలం
అల్ప పరిహాస వెక్కిరింత నన్ను
ఇప్పుడు వేధిస్తుంది
ఏం చేస్తాం
ఎంత వారైనా
వేదాంతుడైన
శ్రీమంతుడైన
గుణవంతుడైన
మన్మధుడైన
మనోహరుడైన
కాలానికి బాకీనే కదా
కాలే కట్టేలో నిర్జివ
దేహలమే కదా
ఇప్పుడు సగం కాలం
విరిసిన తర్వాత
సర్దుకున్న అనుకున్న
సర్ది చేసుకున్న అనుకున్న
సర్ది చేయలేనివి
సర్దు కోలేనివి
అంతరాత్మ వేధించేటివి
కాలం నిందించేటివి
ఎన్నో ఎన్నో ఇంకెన్నో
ఈ కట్టే కాలే వరకు
ఈ పాడే నల్గురు
ఎత్తే వరకు
చిచ్చై మండే వరకు
నాలోని ఈ పశ్చాత్తాపము
మంటలు చల్లారవు
ఈ వ్యధాంత జీవితానికి
సుఖాంత అంతం లభించదు..!!
-సైదాచారి మండోజు