మాజామచెట్టు
ఎప్పుడో చూసాను నిన్ను..
ఎక్కడో కలిసావు నన్ను..
ప్రేమ అనే బంధం..
ముడి వేసింది నిన్నూ నన్నూ..
నాతో తెచ్చుకున్నా..
అమ్మ వద్దన్నా..
మా పెరట్లో పెట్టి పోషించా..
నాతో పాటే పెరిగి పెద్దయ్యావు..
నాకెంతో ఇష్టమయిన..
నీ పండ్లను అందించావు..
మధురాతి మధురమయిన..
ఆ రుచిని ఎలా మరువగలను ?
అలాంటి నిన్ను..
వదిలి వచ్చేసా.
నువ్వెక్కడున్నా..
బాగుండాలని కోరుకుంటా!
-ఉమాదేవి ఎర్రం