కాగితపు తనువు
****
ఒరేయ్ కవి
నా శ్వేత వర్ణం తనువుపై నీ కలం
గాయల బాధల కన్నీటి గుర్తులు ఎన్నో..?
నీ అర్ధం పర్థం లేని పరమ చెత్త
రాతలతో నాకెన్నెళ్లు ఈఅద్దె గర్భపు
ప్రసవవేదనలో…?
ఎన్ని రాత్రులో
నాపై నీ..నిస్సాయత
ఆవేశపు దౌర్జన్యం
ఇంకెన్నాళ్లు
నీ కబంధహస్తాలలో
నా పై ఈ అత్యాచారపు
నలుపులాట
విసురులాటలో
నీ భావవేష అంగస్తంభనకు
నే ఎన్నిసార్లు అసంతృప్తి
భావప్రాప్తి పొందిన తనువునో
నీకెన్ని సార్లు దాసిగా
మారిన నిర్లజ్జపు దేహనో
ఎన్ని నిద్ర లేని రాత్రుల మధ్య
నల్గి వేసాడి నీ అక్షరాల మేధోమధన
సంఘర్షణ రాతల మధ్య
నా తనువును బలిపశువును చేసానో
నీ ఆస్థాన డోలు
బాజా భజంత్రీల
అక్షరాలకు నే ఎన్నిసార్లు
పురుడోసుకోవాలో
నా ఒంటిని ఒలిచి
నీ ఆలోచన మలచి
నిర్వీర్యం అవుతున్న
మీ బతుకుల్లో
ఎన్ని ఆలోచనల
నిప్పులు రాజేసావో
మరెన్ని సార్లు నీ సచ్చిన
ఆలోచనకు
నన్ను బతికున్న
సతీసహగమనం
చేసావో…!!
-సైదాచారిమండోజు