కాలం ఆగిపోతే.. !
ఎగిరే ఓ సీతాకోకచిలుకని బంధించినట్టు…
ప్రకృతిని చూడగలిగే ఈ కనురెప్పలు మూసుకుపోయినట్టు…
వర్షం చినుకులు.. కన్నీటి ధారలు ఆగిపోయినట్టు…
విద్యతో ముందుకు వెళుతున్న ప్రపంచాన్ని అంధకారంలోకి పడేసినట్టు…
పుడమిపై అడుగు పెట్టె ప్రతి జీవి కూడా స్వసా విడిచినట్టు…
భారాలకి, భాద్యతలకి,బంధువులకి,బరువులకి వీడుకోలు చెప్పినట్టు…
కోపాలకి, కరువులకి సంకెళ్లు వేసినట్టు…
ఆకలిని, ఆలోచనని, ఆశయాన్ని సున్యo లోకి తోసేసినట్టు…
రగిలిపోతున్న రాజకీయాలకు రాజినామా చేసినట్టు…
రాజభోగాలు అనుభవించే వారికి బానిసత్వం ఏర్పడినట్టు…
ఆడదాని అన్యాయానికి అడ్డ గోడలు కట్టినట్టు…
జీవితం విలువ తెలియని ప్రయాణికుడికి కూడ పాఠం పుర్తయినట్టు…
ఆవిష్కరించిన వస్తువుకి ప్రయోజనం లెన్నట్టు…
మోసాలు, అబద్ధాలు,కుట్రలు, కుతంత్రాలు, అవసరాలు అనే పదాలకి పిండం పెట్టినట్టు…
పవిత్రమైన ప్రేమని…
కంటున కలలని…
సృష్టించిన దేవుడిని…
మయి మారుస్తునట్టు…
ప్రాణాలనీ నిలిపే పంచభూతాలనీ అంతరించినట్టు…
కాలం ఆగిపోతే…. నేను రాసిన ఈ రచనకి కూడా ముగింపు చెప్పినట్లే…!!!
– ప్రేమ
చక్కగా వ్రాసారు.