మళ్లీ తిరిగి ఊరెళ్తే
మస్తాన్ హైదరాబాద్లో పని చేస్తున్నారు. అతని ఊరు విజయవాడ దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు. ప్రతి రంజాన్ మాసంలో ఒక వారం రోజుల పాటు ఊరికి వెళ్లేవాడు. సంవత్సరం అంతా పనిచేసి, సంపాదించిన ధనంలో కొంత భాగం తన ఊరిలోని పేదలకు, నిర్భాగ్యులకు దానం చేసేవాడు. తను సంపాదించిన దానిలో కొంత భాగం పేదలకు దానం చేయడం అతనికి తృప్తిగా ఉండేది. ఈ సారి మాత్రం పరిస్థితులు తల్లకిందులైయ్యాయి. అతనికి ఉద్యోగం పోయింది. అతను పనిచేసే కంపెనీ నష్టాల బాటలో ఉండటం వల్ల ఆ కంపెనీ వారు కొంతమంది ఉద్యోగస్తులను తొలగించారు. అందులో మస్తాన్ కూడా ఉన్నాడు. వేరే ఉద్యోగం వెతికే పనిలో ఉన్నాడు మస్తాన్. రంజాన్ పండుగ దగ్గర పడుతుంది. ఊరు వెళ్లాలి కానీ చేతిలో డబ్బులు లేవు. ఉద్యోగం కూడా పోయింది. మరి అలాంటి పరిస్థితులు ఊరు వెళితే ప్రతి సంవత్సరం లాగా పేదలకు ఇవ్వాల్సిన దానం ఎలా ఇవ్వాలి అని దిగులు పడుతూ
ఉన్నాడు. రెండు మూడు నెలల నుండి జీతం రావడం
లేదు. అందువల్ల చేతిలో ఉన్న డబ్బులు అన్ని ఖర్చు అయిపోయాయి. కొత్తగా అప్పు
పుట్టే పరిస్థితి లేదు. దానికి కారణం ఉద్యోగం లేకపోవటమే
అని అతనికి తెలుసు. ఈ సారి
ఊరు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు మస్తాన్. తల్లిదండ్రులు ఎందుకు రావటం లేదని
ఫోన్ చేసి అడిగారు. ఏదో
ట్రైనింగ్ పూర్తి చెయ్యాలి
కాబట్టి ఈ సారి రావటం
కుదరటం లేదని చెప్పాడు
మస్తాన్. దేవుని దయవల్ల
అతనికి నిన్నే ఉద్యోగం
వచ్చింది. కానీ ఆ కంపెనీ వారు ఉద్యోగంలో వెంటనే జేరాలని
కండిషన్ పెట్టారు. మొదటి మూడు నెలలు సెలవలు అడగవద్దు అని కూడా కోరారు.
అందువల్ల ఆదివారం తప్ప వేరే సెలవలు లేవు. ఇప్పుడు ఊరెళ్తే
ఎలా అని అతని మనస్సాక్షి
ప్రశ్నిస్తోంది. పనే దైవం అని
భావించే మస్తాన్ ఈ సారి
ఊరు వెళ్ళలేదు.
-వెంకట భానుప్రసాద్ చలసాని.
పనే దైవం.