మధ్య తరగతి జీవితం
నీకంటూ ఎన్నో ఆశలతో
ఎప్పుడు సమరమే
నీకంటూ ఉన్న కోరికలతో ఎప్పుడు యుద్ధమే
నీకంటూ ఉన్న ఆశయాలతో ఎప్పుడు పోరాటమే
నీకంటూ ఉన్న ఆనందాలు తీరటం కోసం ఎప్పుడు సంఘర్షణలే
నీకంటూ ఉన్న బంధాల కోసం ఎప్పుడు ఆరాటమే
ఇదే మధ్య తరగతి జీవితం
– భరద్వాజ్