వడగట్టిన ప్రపంచాన్ని
ప్రజాస్వామ్యం కదిలే జలపాతం…
కలుపుకొని ప్రవహించే తనమ్మయత్వపు
అధికారం…తామసపు తెరల చాటున
దుఃఖ భావనని లోకం విడ్డూరాలతో చూపక
తమ కొరకు తమయుగ్మంలో ఒకరి నిర్ణయం
పది కాలాలకు బాసట కావాలని…పట్టు
తప్పిన తలమానికాలను అభ్యధయమై
సాధించే వినియోగం కావాలని ఓటేయి…
చీకటిని రక్తికట్టి ఒకరి కొరకన్నది లోకాన్ని
ఆవరించిన స్వార్థపు నీడని…సమితి
సమాయత్తంలోంచి శరమై గుచ్చిన గమ్యం
అందరికి తెలిసిన చిత్రమై…పంచే గుణంతో
అందరి ఆనందాలను కదిలించాలని…ప్రతి
ప్రయత్నం ప్రామాణికపు విలువలతో చేసే
మనిషి కర్తవ్యమని…గడప గడపన
ప్రమిదలు వెలిగించాలని ఓటేయి…
చేత బట్టిన ప్రాథానిత్యం పశులు నడిచిన
పల్లెబాటన పాదయాత్రలు కారాదని…
రేపటి సూర్యుడి కోసం నేటి చరిత్రలను
వడగట్టిన ప్రపంచాన్ని విసిరేసి…
వెలుగుల కెరటమై వచ్చే భవితవ్యానికి
మార్గదర్శకమవుతు… వినియోగించిన
సాధికారితతో యుగ సత్కారాలను
నడిపించే సారథ్యమని…. ప్రగతి నేర్చిన
సాధకునిగా సన్నద్దమై ఓటేయి…వేసిన
ఓటు ఘాతకం కారాదని మానవజాతి
మనుగడ కోసం జాత్యాంకారాల జాఢ్యాలను
రూపుమాపడం కోసం ఓటేయి…
– దేరంగుల భైరవ