వలసల జీవితం
బ్రతుకు బాట కోసం
పల్లె నుంచి పయనమాయే
పట్టణం కొత్తాయే
మనుషులు మందలించే
వారు కరువాయే…!!
మాయదారి కరోనా ఆయె
వలసలు ఏమో ఎక్కడికో
తెలీదాయే
తల దాచుకొనికి ఏ దిక్కు పోతున్నామో
తెలీదాయే వుండనికి జాగా
కూడా దిక్కు లేదాయె..!!
వలసలు మావి ఎక్కడికి పోతామో
ఎక్కడ ఉంటామో తెలీదాయే
శరణార్థుల లాగా మిగిలిపోతున్నామాయే
బుక్కెడు బువ్వ కోసం కష్టమాయే
గంజి నీళ్ల కోసం పాకూడాయే
నడకన సాగె ప్రయాణం చివరి చూపుకాయే..!!
ఆగే నడక కాదు ఈ పయనం
రోప్పొచ్చి సొలసోచ్చినా నెత్తిన మూటతో సమరం
అన్ని వదిలి పిల్లా జెల్లలతో సాగె రుదిరం
“వలసల జీవితం” తోని మాయి గమనం..!!
-పోతగాని శ్యామ్ కుమార్