భయం పోయింది

భయం పోయింది

 

రామయ్య తన పిల్లల దగ్గరకు వచ్చాడు. ఆయన ఉండేది ఒక మారుమూల గ్రామంలో.పిల్లలుహైదరాబాదులో ఉద్యోగంచేస్తున్నారు. చాలా కాలంతర్వాత పిల్లల వత్తిడితోహైదరాబాద్ వచ్చాడు. అలాహైదరాబాద్ వచ్చిన ఆయనకుసీటీ చూపించాలని పిల్లలంతాఅనుకున్నారు. మెట్రోలో ఒకసారి నగరమంతా చూపించాలి
అని అనుకున్నారు. రామయ్య వద్దన్నాడు. నేలమీద వెళ్ళే రైలు ఎక్కాలంటేనే ఆయనకుభయం.

0అలాంటిది పిల్లర్ పైవేసిన ట్రాక్ పైన వెళ్ళే రైలుఎక్కాలంటేనే ఆయనకు భయం మొదలైంది. భయంవల్ల ఆయన మెట్రో రైలునుఎక్కను అని చెప్పాడు. ఆపిల్లల వత్తిడితో మెట్రో ఎక్కేపరిస్థితి వచ్చింది. మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ కు వెళ్ళారు.ఎస్కలేటర్ ఎక్కడానికి చాలాభయపడ్డాడు రామయ్య. మెట్లు ఎక్కే పనిలేకుండాఎస్కలేటర్ పై నుంచుంటేచాలు పైకి వెళ్ళిపోవటం అనేది ఆయనకు భయంకలిగించింది.

పిల్లలు మరీ వత్తిడి చేయటంతో కళ్ళుమూసుకుని ఎస్కలేటర్ఎక్కాడు. పైకి వెళ్ళిన తర్వాతటికెట్ కౌంటర్లో టికెట్ తీసుకునిఫ్లాట్ఫామ్ వద్దకు వెళ్ళే దారిలోరామయ్య జుబ్బాలో ఉన్న చుట్టల పాకెట్టు,అగ్గిపెట్టె తీసేసుకున్నారు సెక్యూరిటీవారు. నేను అవి ఇవ్వనంటేఇవ్వనని గొడవ చేసాడు మన
రామయ్య.

ఆయన పిల్లలు మళ్ళీ ఆయనకు సర్ది చెప్పారు.కోపంగా గొణుక్కుంటూ ఆయన ట్రైన్ ఎక్కాడురామయ్య. రైలు ఎక్కగానేడోర్ మూసుకు పోయింది.బేర్ మని భయంతో అరవసాగాడు రామయ్య. కళ్ళుమూసుకుని సీటులో కూర్చున్నరామయ్యకు భయంతో చమటపట్టడం మొదలైంది. పిల్లలంతా ఆయన పరిస్థితి చూసి నవ్వడం మొదలుపెట్టారు. పిల్లల వత్తిడితో కళ్ళు తెరిచిచూసిన రామయ్యకు క్రిందవెళ్ళే ట్రాఫిక్ ని చూసి మళ్ళీభయంతో పిల్లల చేతులనుపట్టుకున్నారు.

కొంత సమయంగడిచిన తర్వాత ఆయనకు భయం పోయి గమ్మత్తుగా ఉంది. ఆ తర్వాత ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు.అమీర్ పేట్ రాగానే రైలు దిగినవారు మళ్ళీ రామయ్య బలవంతం చేయడంతో మళ్ళీరైలు ఎక్కారు. అంతగా ఎంజాయ్ చేసాడు రామయ్య.సిటీలో ఉన్నన్నాళ్ళూ మెట్రోఎక్కుతూనే ఉన్నారు రామయ్య. అందరూ ఒకసారైనా మెట్రో ఎక్కాలని రామయ్య భావిస్తున్నారు.ఎంతైనా మెట్రో అనేదితెలంగాణ రాష్టానికే ఎంతో గర్వకారణం.

-భానుప్రసాద్.

0 Replies to “భయం పోయింది”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *