విద్యాలయాలు
విద్యా-బుద్ధి…
అనే ధ్యేయం తో
గుడిలా ప్రకాశించేవి,
ఆనాటి విద్యాలయాలు!
విద్యను రుద్ది…
వ్యయంతో కూడుకున్నవి
నేటి విద్యా హొయలు!!
అందుకేనేమో?!
అనాథ శరణాలయాలు,
అమ్మానాన్న వృద్ధాశ్రమాలు!
అర్థంలేని పోటీ ప్రపంచంలో
అదుపులో లేని పొట్టకోసం..
అడ్డంగా పొట్టకొట్టే లంచమనే
సంస్కృతిని, పెంచి, పోషించి..
అర్థంకాని నేటి జీవన
విపంచి లో ఆకలి తీరుస్తున్నది
ఓ వ్యర్ధమైన కంచం!
ర్యాంకులు..ర్యాంకులే ధ్యేయంగా..
విద్యా-బుద్ధి ని పక్కన పెట్టి,
కార్పొరేట్ విద్యా అనే
విదేశీ షాంపులతో
తలను రుద్దుతూ ఉంటే?!
పిన్న వయసులోనే..
ముదురు ఆలోచనలు రావా??
తెల్ల జుత్తువెంట్రుకలు వలె!
చిన్న ఆయుష్షు తోనే
అంతరించి పోవా?!
ముదిరిన వెంట్రుకలు వలే?!
-గురువర్ధన్ రెడ్డి