దారిలో దెయ్యం
ఒక అందమైన ఊరు ఆ ఊరిలో హరీష్ అనే అబ్బాయి వాళ్ళ నాన్న రైల్వే ఉద్యోగి ఎప్పుడు చూసినా ట్రాన్స్ఫర్ అయ్యేది అలా ఈసారి ఒక మారుమూల ఒక చిన్న గ్రామంకి వెళ్ళాము అక్కడ నుంచి కొత్త కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవడానికి సిటీ కి వెళ్ళాను అది చాలా దూరం అడ్మిషన్ వర్క్ కంప్లీట్ చేయడానికి లేట్ అయ్యింది అక్కడ నుంచి ఊరు వెళ్ళాలంటే బస్ లేవని తెలియదు.
ఆ రూట్ లో వెళ్ళే వేరే బస్ ఎక్కాను వర్షం మొదలైంది నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక 5 కిలోమీటర్లు వర్షం చీకటి ఆకలి ఆ సిట్యుయేషన్ లో నడవాల్సి రావడం అలా వర్షంలో తడుస్తూ వెళ్తున్నా నాకు భయం వేసింది ఆ సమయంలో ఒక బండి ఇటువైపు రావడం కనిపించింది లిఫ్ట్ అడిగాను అతనితో కలిసి వెళ్తున్నా అతను వాళ్ళ రిలేటివ్స్ హాస్పిటల్ లో ఉంటే చూసి వస్తున్నాడు నన్ను అడిగాడు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అప్పుడు మేము ఇక్కడికి కొత్తగా వచ్చాము అని చెప్పాను.
టైం అంత లేట్ కాలేదు కదా ఈ రూట్ లో వెహికల్స్ ఎందుకు లేవు అని అడిగాను అప్పుడు నాకు భయం వేసింది నేను ఇంత సేపు నడవాల్సి వచ్చేది 5 కిలోమీటర్స్ ఆ రూట్ లో స్మశానం అని ఆ రూట్ లో వెళ్లిన వాళ్ళు చాలా మంది చనిపోయారు అని
వర్షం ఇంకా ఎక్కువైంది బండి ఆపేసి ఒక చెట్టు కిందకి వెళ్ళాము అక్కడ ఒక ముసలాయన పడిపోయి ఉన్నాడు అతన్నిలేపాము సృహలో లేడు అతన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాం అతనికి 80ఏళ్లు ఉంటాయి అతను చాలా భయంకరంగా ఉన్నాడు అతని చర్మం ముట్టుకుంటే ఊడిపోయేలా ఉంది ఇంకా మేము అతన్ని బండి మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాము డాక్టర్ అతను చనిపోయాడు అని చెప్పాడు.
అక్కడ డాక్టర్ కి డీటైల్స్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము తినేసి నిద్రపోదాం అనుకుంటున్న కానీ నాకు నిద్ర రావట్లేదు ఇంత సేపు శవంతో ప్రయాణం సాగింది అన్న భయం ఆ ముసలాయన రూపం కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ప్రతిసారీ నాకు కనిపిస్తోంది నాకు సపరెట్ రూం ఉంటుంది నేను ఒక్కడినే ఉన్న రూం లో లైట్స్ అన్ని వేసుకొని పడుకున్న టైం ఒకటి అయ్యింది.
ఐనా నిద్ర రావట్లేదు మొత్తం నిశబ్దం ప్రతి పురుగు చేసే చిన్న చిన్న శబ్దం గొడ్జిల్ల శబ్దం లాగా వినిపిస్తోంది ఆ లైట్ కి బయట చెట్లు ఊగుతూ ఆ నీడ రూం లో పడుతోంది ఆ రూట్ లో వెళ్ళే వెహికల్స్ అన్ని కనిపిస్తున్నాయి అలాగే మెల్లగా నిద్రలోకి జారుకున్న సడెన్ గా ఒక చిన్న పాప నవ్వుతున్న శబ్దం వినిపించింది చాలా భయం వేసింది ఆ చుట్టుపక్కల ఇళ్లు లేవు పిల్లలు ఎవరు లేరు నా రూం లో నుంచే ఆ శబ్దం వస్తోంది అప్పుడు నాకు కనిపించింది.
లాఫింగ్ డాల్ ఆ సౌండ్ దాని నుంచే వచ్చింది ఎప్పుడు గట్టిగా నొక్కితే కానీ పనిచేయని బొమ్మ సడెన్ గా ఆ టైం లో శబ్దం చేసేసరికి నా భయం ఇంకా ఎక్కువైంది అప్పటికి టైం 3 అయ్యింది ఆ బొమ్మలో ఉన్న బ్యాటరీ తీసేసి ఒక మూలకి పడేసాను ఫుల్ గా నిద్ర వస్తోంది నిద్రమత్తులోకి జారుకున్న అలా నిద్రలో జారుకున్న తర్వాత నా మీద ఏదో వచ్చి పడింది.
లేచి చూసాను అక్కడ ఉన్నది ఆ ముసలాయన సంచి అప్పుడు నా భయానికి హద్దులు లేవు ఎం చేస్తున్నానో నాకే తెలియదు అపుడు టైం 4 అయ్యింది ఇంకో అరగంట లో అందరూ లేస్తారు అప్పటివరకు ఎం చేయాలని ఆలోచించి ఫ్రెష్ అయ్యాను ఇంట్లో వాళ్ళు లేచారు. నేను వాళ్ళకి ఏమి చెప్పాలనుకొలేదు మళ్ళీ నా రూం కి వెళ్లి చూసాను ఆ సంచి కనపడలేదు. ఆ లాఫింగ్ డాల్ కూడా కనపడలేదు. వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అతని సంచి ఎక్కడా అని అది అక్కడే ఉంది నాకు ఎం జరుగుతుందో అర్థం కాలేదు ఆ రోజు ఎలాగో గడిచిపోయింది.
ఆ రోజు రాత్రి మళ్ళీ రూం లో ఒక్కడినే నిద్రపోవాలి అలా నిద్ర పోవడానికి నా ఫ్రెండ్ నీ కూడా జాగారం చేద్దాం అని రమ్మన్నా ఆ రోజు రాత్రి మళ్ళీ ఒక చిన్న పాప ఏడుపు శబ్దం వినిపించింది మళ్ళీ ఆ బొమ్మ అనుకుని లేస్తున్న కానీ అది నవ్వాలి కదా ఏడుస్తుంది ఎంటి అని ఆలోచించా కళ్ళు తెరవాలి అంటే భయం వేస్తోంది ఇంకా శబ్దం వినిపిస్తోంది ఎం చేయాలో అర్థం అవ్వలేదు నాతో వచ్చిన వాడు నిద్రలో మునిగిపోయాడు.
నాకు వణుకు మొదలైంది నిద్రమత్తు మొత్తం పోయింది శరీరం మొత్తం ఆ భయానికి చల్లగా అయ్యి పోయింది ఏదో చల్లగాలి వేసినట్టు ఎక్కడో చదివాను దెయ్యాలు వచ్చే టైం మొత్తం చల్లగా ఉంటాయనినా భయం ఇంకా పెరిగింది మైండ్ పని చేయడం లేదు గట్టిగా అరవాలి అనిపిస్తోంది కానీ నోటి నుంచి మాట రావట్లేదు కళ్ళు గట్టిగా మూసుకుని దేవుళ్ళని తలచుకున్నా ఈ ఒక్క రోజు అన్నా నిద్ర పట్టేలా చూడండి మెల్లగా నిద్రలోకి జారుకున్న,
ఎవరో నిద్ర లేపుతున్నట్టు అనిపించింది కళ్ళు తెరవాలి అంటే భయం ఎం చేయాలో తెలియక గట్టిగా అరిచాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మా అమ్మ నన్ను నిద్ర లేపి అరుస్తోంది. అప్పటికి టైం మధ్యాహ్నం 12 అయ్యింది అనిఅప్పుడు నాకు తెలిసింది ఇదంతా కలలో జరిగిందా అని.
-భరద్వాజ్