దృశ్యం
జీవితం రంగులమయం
కాలేదని పరితపిస్తావెందుకు
పరికించి చూస్తే ప్రకృతే నీతో పలుకుతుంది
ప్రతి దృశ్యం ఓ పాఠమై నీలో చేరుతుంది
వినే ఓపికుంటే చూసే కౌశలముంటే
కుశలమూ అడుగి కలం నీ చేతికిస్తుంది
కాలమెంత కరుకైనదో గుర్తుంచుకుని
మనసంత ఇరుకు కాకుండా చూసుకుంటే
జీవితమిక మార్దవం..ఆనందపు ఆర్ణవం..
సి.యస్.రాంబాబు