ఉగాది
కాల చక్ర భ్రమణం
గావించిన వేళ,
కొత్త చిగుళ్ళతో వసంత మాసం ఆహ్వనించు వేళ,
సుమ సౌరభాలతో ప్రకృతి
వెల్లివిరిసిన వేళ,
విలంబి నామధేయంతో
వికసిస్తూ విరబూసినవేళ,
కష్టాలు అన్నీ విడిచి
కలతలు అన్నీ మరచి
స్వాగతించుదాము ఈ వేళ
ఆ… షడ్రురుచుల సమ్మేళనంతో
ఈ విళంబి నామ ఉగాది హేళ
ఇదిగో వచ్చింది
మరో యుగాది
సిరి సంపదలు మీ
ఇంట వర్షించాలని,
రాగ ద్వేషాలను
దరికి రానీయక
అమృత భాండంతో
మీరు తుల తూగాలని,
ఎన్నో వసంతాలు మీ
మదిని తాకాలని కొంగ్రత్త
ఆశలకు మీ వాకిలి నిండాలని,
నింగిలోని చుక్కలన్ని మీ
ముంగిటలో రంగ వల్లులై
పెనవేసుకోవాలని,
ఈ వసంతోత్సాహంలో నూతనోత్సాహంతో
తీపి,చేదు,కారం,వగరు
ఉప్పు,పులుపు కలయికలుగల
జీవిత సారాన్ని చెప్పే షడ్రురుచుల సమ్మేళానాన్ని
ఆస్వాదిస్తూ…
తరతరాల బంధాలను
కాపాడు కుంటూ,
వృత్తిని,
ప్రవృత్తిని గౌరవిస్తూ…
మన తెలుగు ఖ్యాతిని
అంతరించకుండా
రేపటి తరానికి అంది
ఇవ్వాలనే ఆశతో…
– గురువర్ధన్ రెడ్డి