కుటుంబ విలువలు

కుటుంబ విలువలు

ఒక పల్లెటూరు అ ఊరిలో పెద్ద లోగిళ్ళలో వున్న ఒక ఇంట్లో ఆరోజు ఉగాది పండుగ అవ్వటంతో ఒకటే హడావిడి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు తలస్నానాలు చేయటం, కుర్రాళ్లు నిద్రలేచే ప్రయత్నం చేయటం, ఆడపిల్లలు నిద్ర లేచి కాఫీ, టీ ల కోసం తల్లులని కంగారు పెట్టటం. ఇలా ఇల్లు హడావిడి హడావిడిగా వుంది… నలుగురు అన్నదమ్ములు అయిన ఆ ఇంటి పెద్ద లోగిలిలో కూర్చొని అందరి విశేషాలు తెలుసుకొంటూ వారు చెప్తున్నారు…

అ ఇంటి పెద్ద కొడుకు విజయ్ చదువు ముగించుకొని సిటీలో ఉద్యోగానికి ప్రయాణం అయ్యే రోజు కూడా ఉగాది రోజే.. ఇంట్లో ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి తీసుకురావటానికి విజయ్ మిగిలిన కుర్రాళ్లు, ఆడపిల్లలు అందరూ కలిసి బయటకి వచ్చారు. అన్నీ ఇంటికి తీసుకువెళ్లారు.

విజయ్ వాళ్ళ అమ్మ ఉగాది పచ్చడి చేసి అందరికి పెడుతుంది.. విజయ్ వాళ్ళ నాన్న తో కూర్చొని బాబాయిలు చెప్తున్నది వింటున్నాడు. ఎన్నో సమస్యలు ఎన్నో ఆనందాలు విజయ్ కి ఉగాది పచ్చడి రుచిలా అనిపించింది. అన్నీ వున్నాయి.. బంధాలు కలిసి ఉంటేనే ఎటువంటి ప్రమాదం జరగదు.. అర్ధం చేసుకొని కలిసి ఉండటం లోనే జీవితం అని తెలుస్తుంది విజయ్ కి

విజయ్ ఊరికి బయల్దేరతాడు. ఇంట్లో అందరూ హడావిడిగా విజయ్ కి ఏమి కావాలో అన్ని సర్దిపెట్టారా అని ఒకటే హడావిడి. ఉగాదికి అని వచ్చిన విజయ్ కి కుటుంబం, బంధం విలువ తెలిసింది. ఉగాది పచ్చడి రుచుల సమ్మేళనమే జీవితపు ఒడిదుడుకులు అని తెలిసింది. అన్నీ సర్దుకొని ఉగాది రోజు సాయంత్రం ఊరు బయల్దేరతాడు విజయ్. తండ్రి జాగ్రత్తగా వెళ్ళు విజయ్ అంటున్నాడు. సరే నాన్న అని తండ్రిని కౌగలించుకొని దండం పెట్టి వూరు వెళ్ళటానికి బస్టాండ్ కి వస్తాడు.

అదే సమయం లో వేరే ఊరులో వున్న కీర్తన కూడా వూరు బయల్దేరుతుంది. విజయ్, కీర్తన ఒకే ఊరికి వస్తారు ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ వుంటారు. విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో రూమ్ లో వుంటూ సరదాగా హాలిడేస్ లో పార్టీస్ అని ఇలా జరుగుతూ ఉంటాడు. కీర్తన కూడా ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఇద్దరి ఇళ్లలో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఫొటోస్ ఒకరిది ఒకరు చూసుకొని ఇద్దరు ప్రేమించుకున్న వాళ్లే అని తెలిసి ఆనందంగా వుంటారు. 

విజయ్, కీర్తన ఇద్దరూ 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు కానీ ఎవ్వరికి తెలియదు స్నేహితులతో కూడా చెప్పరు. కానీ వీళ్ళకే తెలియకుండా వీళ్ళని ఒక వ్యక్తి గమనిస్తూ వుంటారు.

ప్రస్తుతం

పెళ్లి సమయం దగ్గర పడుతుంది. చుట్టాలు వచ్చేస్తారు, ముహూర్తం టైం దగ్గర పడుతుంది. విజయ్ పీటల మీద కూర్చొని ఉంటాడు కీర్తన తాళ్లి కట్టే సమయం అవుతున్నా రాకపోయే సరికి విజయ్ కి అనుమానం వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటాడు. టెన్షన్ తో అందరికీ ఫోన్ చేస్తాడు. మండపంలో అందరు వెతుకుతూ వుంటారు. ఇంక విజయ్ బయట వెతకటానికి వెళ్తాడు. దారిలో ఉండగా విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే కీర్తన ఫోన్. వీడియో కాల్ అది. విజయ్ లిఫ్ట్ చేస్తాడు.

కీర్త : నా కోసం వెతుకుతున్నావా నీ టైం వేస్ట్ చేసుకోకు నేను ఇతనినే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తుంది.

విజయ్: కీర్తన ఏమి మాట్లాడుతున్నావు మన ప్రేమ విలువ ఇంతేనా అంటాడు.

కీర్తన: నువ్వు నమ్మావు నేను అవకాశం అనుకున్నాను వదిలేయి అంటుంది.

విజయ్ కి ఏమి చేయాలో అర్ధం కాదు అసలు ఏమి జరిగివుంటుంది అని ఆలోచిస్తాడు. అప్పుడు విజయ్ కి ఒకటి అర్ధం అవుతుంది. ఇంతకు ముందు విజయ్ కీర్తనతో ఆఫీస్ లో పనిచేసే కొలీగ్ అప్పుడు చూస్తాడు ఒక అబ్బాయిని అతనే ఇప్పుడు వీడియో కాల్ లో చూసిన అబ్బాయి.

ఎవరు అతను?

విజయ్ ఆఫీస్ లో వున్న తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. వీడియో కాల్ లో చుసిన అతని ఫోటో పంపి ఎవరో ఏంటో కనుక్కోమని చెప్తాడు. ఫ్రెండ్ అతని వివరాలు చెప్తాడు. కొత్త గా జాయిన్ అయ్యాడు మన ఆఫీస్ cc tv footage చూస్తే ఎప్పుడూ కీర్తన వెనకాలే ఉంటున్నాడు అని చెప్తాడు.

విజయ్ వాళ్ళ బాబాయ్ (పోలీస్ ఆఫీసర్) కి కాల్ చేస్తాడు. తనకి వీడియో కాల్ వచ్చిన నెంబర్ ఏ లొకేషన్ లో ఉందో ట్రేస్ చేసి చెప్పమని చెప్తాడు. వెంటనే లొకేషన్ తెలుసుకొని విజయ్ కి పంపిస్తాడు. విజయ్ ఆ లొకేషన్ కి వెళ్లి అతని కొట్టి మండపానికి తీసుకువస్తాడు. వాళ్ళతో అతనిని కూడా తీసుకువస్తాడు విజయ్

మండపంలో అందరూ ఏమి అయిందో అర్ధంకాక పిచ్చి చూపులు చూస్తుంటారు. కీర్తన ఏడుస్తూవుంటుంది. విజయ్ వాళ్ళ బాబాయ్ కి ముందే చెప్తాడు అతని తీసుకువస్తున్నట్లు. అతని అరెస్ట్ చేయటానికి రెడీగా ఉంటాడు వాళ్ళ బాబాయ్. అందరూ ఏమి జరిగింది అని అడుగుతూ ఉంటారు కానీ విజయ్ కళ్ళు మాత్రం ఒక వ్యక్తి కోసం వెతుకుతువుంటాయి. అ వ్యక్తి మండపం లో లేరు అని కన్ఫర్మ్ అవుతుంది విజయ్ కి.

అసలు అ వ్యక్తి ఎవరు?

విజయ్ వెతుకుతున్న వ్యక్తి కనపడకపోవడంతో ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అందరినీ అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు కీర్తన వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది అందరు ఒకోచోట వెతుకుతారు కానీ విజయ్ మాత్రం కూర్చున్న చోటి నుంచి కదలకుండా “కీర్తన మీ అమ్మ గారు ఇక్కడ వుండరు” అని అంటాడు.

కీర్తనకి అక్కడ వున్న ఎవ్వరికీ ఏమి అర్ధం కాదు. విజయ్ వాళ్ళతో తీసుకువచ్చిన అతనికి మాత్రమే తెలుసు కీర్తన వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో. విజయ్ వెంటనే లేచి అతని దగ్గరకి వెళ్లి “పదరా మా అత్తయ్య ఎక్కడ వున్నారో చూపించు” అంటూ లాకెళ్తాడు. విజయ్ తో పాటుగా కీర్తన కూడా వెళ్తుంది.

అతను విజయ్ వాళ్ళని కట్టడం పూర్తికాని ఒక బిల్డింగ్ లోకి తీసుకువెళ్తాడు. అక్కడ కీర్తన వాళ్ళ అమ్మని కట్టేసి ఉంచుతారు. విజయ్ కీర్తన వాళ్ళ అమ్మ ఇదంతా  చేయించిందేమో అనుకుంటాడు కానీ అసలు ఇది అంత చేసింది కీర్తననే.

కీర్తన ప్రేమించింది నిజమే. కానీ తనకి ఎప్పుడు డబ్బు, నగలు, జల్సా చేయటం ఇది అంటేనే ఇష్టం. ఇవి ఏవి విజయ్ దగ్గర దొరకవు కానీ విజయ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నది నిజం ఎందుకు అంటే?

కీర్తన వాళ్ళ అమ్మని విజయ్ కాపాడతాడు కీర్తన అమ్మ విషయం మొత్తం విజయ్ కి చెప్తుంది. కీర్తన చేసిన తప్పు వాళ్ళ అమ్మకి చేయాల్సిన వీడియో కాల్ విజయ్ కి చేసింది అందుకే కథ ఇంత దూరం వచ్చింది. విజయ్, కీర్తన ప్రేమించుకునే సమయంలో వీళ్ళని కంట కనిపెడుతున్న వ్యక్తి కీర్తన వాళ్ళ అమ్మ పెట్టిన మనిషి.

కీర్తన వాళ్ళ అమ్మకి తెలుసు కీర్తన ఎలాంటిదో అందుకే వీళ్ళ ప్రేమ నిజమో కాదో తెలుసుకోవాలి అని మనిషిని పెట్టింది. నిజం అని తెలిసాక పెళ్లి కి ఒప్పుకుంది. కీర్తన పెళ్లికి రాకుండా ఈ కిడ్నప్ చేయించుకోడానికి కారణం వేరే వుంది అది కీర్తనకి తెలుసు అని వాళ్ళ అమ్మ కి తెలియదు అందుకే పెళ్లి కి ఒప్పుకుంది.

కీర్తన వాళ్ళ అమ్మ ని మాత్రమే తీసుకువెళ్ళడానికి వెనక వున్నా కారణం ఏమిటి ?

కీర్తన వాళ్ళ అమ్మ పేరు మీద కొన్ని కోట్ల ఆస్తులు వున్నాయి భూములు వున్నాయి. తన కూతురు జల్సాలకి, పార్టీలకి అలవాటు పడి కష్టం తెలియకుండా వుంది అని తన ఆస్తి లో 80% ఆశ్రమాలకు, అనాధలకు ఇచ్చేద్దాము అనుకుంటుంది. కీర్తనకి ఈ విషయం వాళ్ళ అమ్మ PA ద్వారా తెలుస్తుంది.

కీర్తన వాళ్ళ అమ్మ విజయ్ చాల మంచివాడు తన ఆస్తిని, కీర్తనని బాగా చూసుకుంటాడు అని పెళ్లికి ఒప్పుకుంటుంది ఈ విషయం తెలియక కీర్తన ఈ కథ మొత్తం నడిపిస్తుంది. కానీ కీర్తన ఇలాంటి పని చేస్తుంది అని ఉహించదు. కీర్తన వాళ్ళ అమ్మ తన ఆస్తి మొత్తం విజయ్ పేరు మీద రాసేస్తుంది. ఇప్పుడు కీర్తన విజయ్ దగ్గరకి వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం అంటుంది

కానీ విజయ్ ఒప్పుకోడు. అసలు ట్విస్ట్ ఇప్పుడు ఇస్తాడు విజయ్ కీర్తన కి. విజయ్ కీర్తన కి ఇలా చెప్తాడు.

కీర్తన నా ప్రేమ లో నిజాయితీ వుంది నీ ప్రేమ లో నిజాయితీ వుంది కానీ నీ ఆలోచన, జీవితంలో నేను ఉండాలి అని నువ్వు అనుకోవటం లేదు. ప్రేమ అనేది వయస్సు లో వచ్చే ఆకర్షణగా ఫీల్ అవుతున్నావు. ఇది నీకు నేను చెప్పాలి అనుకున్నాను. కానీ అసలు విషయం ఏమిటో తెలుసా. మీ నాన్న వల్ల నాకు ఎంతో ఇష్టం అయినా నా తాత ని కోల్పోయాను.

మీ నాన్న కి డబ్బు వుంది అనే పొగరుతో ఆక్సిడెంట్ చేసి నడిరోడ్డు మీద అనాధలా వదిలేసి బతిమాలుకున్న అలా వదిలేసి వెళ్ళిపోయాడు మీ నాన్న బంధాలు, బంధుత్వాలు, మానవత్వం గురించి తెలియని మీ నాన్నకి తెలియచేయాలి అని నువ్వు చదివే కాలేజీ లోనే జాయిన్ అయ్యాను. నీ ఆఫీస్ లోనే జాయిన్ అయ్యాను. నిన్ను ప్రేమ లో పడేసాను. నీ బలహీనత నాకు అవకాశం అయింది. మీ అమ్మ అమాయకత్వం నాకు కలిసివచ్చింది.

మీ కుటుంబానికి బంధాలు, బంధుత్వాలు, విలువలు, మానవత్వం తెలియాలి అంటే మిమల్ని కూడా ఈ డబ్బు, దర్పం, ఆస్తులు అన్నీ మీ దగ్గర లేకుండా చేసి మిమల్ని పూర్తిగా లేని వాళ్ళని చేయాలి అని నేను ఇది అంత చేశాను. నీకు కనువిప్పు కలగాలి నువ్వు ఇంకా ఇంకా కిందకి వచ్చేయాలి ఆకలి విలువ తెలియాలి అని విజయ్ తన కుటుంబం తో బయటకి వెళ్ళిపోతాడు.

కధ సమాప్తం

– సూర్యాక్షరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *