ఉదాసీనత
తెరచిన కిటికీ ఆకాశాన్ని చదువుతోంది.
రెక్కపై పిట్టొకటి నిలుచుని లోనికిచూస్తోంది.
నాలుగుగోడల నైరాశ్యం;
గదిలో మనిషికి ఇవేమీపట్టవు!.
పై కవితా పంక్తులు సేకరణ ట్విట్టర్ నుండి అనురాధ బండి గారి స్ఫూర్తి తో కింద కవిత
నేను రాసింది. … భవ్య చారు
ఆ కళ్ళు నిరాశ నిసృహలతో చూస్తోంది
కళ్ళలో ఉండాల్సిన కన్నీరు కూడా
ఎప్పుడో కరిగి నీరయ్యి, ఎండిపోయింది
కాలం లో కదిలినప్పుడు, వయసులో
ఉన్నప్పుడు ఎన్నో పనులు అలోవకగా
చేసినాచేతులు ఇప్పుడు కదలనని మొరాయిస్తున్నాయి,
నాలుక దాహం తో పిడచ కట్టుకు పోతుంది
చర్మం పై ఎదో పాకుతున్నట్ట్టు గా ఉంది
దాన్ని తీసెయ్యాలని ఉన్నా కదలలేని చెయ్యి నీ
చూసి గొంతెత్తి ఎవరినైనా పిలవాలని ఉంది
కానీ…. పిలిచినా పలికే దూరం లో ఎవరూ
లేని ఒంటరి గది లో బంధిoచారు
వయసుడిగిన సమయనా అయిన వారందరూ
పరాయి వారే, ఎన్నో సేవలు చేయించుకున్న కన్న
పిల్లలే అసహ్యించుకుంటూ , ఇంటికి దూరంగా
కట్టిన నాలుగు గోడల మధ్య పారేశారు
అందుకే ఆ గదిలోని మనిషికి ఇవేవి పట్టవు
కళ్ళలోని నైరాశ్యం కాలం తొందరగా తీసుకువెళ్తే
బాగున్ను అనే ఆశ తో ఎదురుచూస్తుంది వేదనగా ..
– భవ్య చారు