మూగజీవాల ఆవేదన
మూగజీవాలు నోరులేనివి మాత్రమే కానీ ఈ భూమ్మీద జీవించే హక్కు అన్నింటికీ ఉంది. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి జీవించే హక్కు సృష్టించబడింది. ప్రతి జీవి పుట్టుక నుండి చావు వరకు హింసించబడకూడదు అనేది ఈ సుందరవిశ్వంలో అన్ని అందాల అమరికలే అని తెలుసుకోవాలి. మానవ హక్కులకు చట్టాలు ఉన్నట్లే మూగజీవాలకు కూడా జంతు సంరక్షణ చట్టాలు ఉన్నాయి కానీ వాటిని తుంగలో తొక్కి పవిత్రమైన గోమాతను సైతం వధించి భుజిస్తున్నారు.
మూగ జీవాలు కూడా పర్యావరణసమతుల్యంలో భాగమే అది గుర్తించని జనాలు వాటిని ప్రేమించడం మానేసి వధించడం చేస్తున్నారు. మూగజీవాల నాశనానికి కారణమవుతున్నారు. పచ్చని చెట్లు నరికివేసి జీవావరణంలో వాటి చోటును కూడా లాక్కుంటున్నాడు మనిషి. మానవ తప్పిదాల వలన వాటి ప్రాణాలను బలికుంటున్నారు.
అడవులు కాలిపోయినప్పుడు కరువుకాటకాలు సంభవించినప్పుడు ప్రకృతి విలయాలలో మూగజీవాల ఆవేదన అరణ్యరోధనే మానవ ఆవాసాలు ఎలాగో మూగజీవాలు కూడామనిషి మనుగడకు అవసరమే అని అవగాహన పెంచుకొని బాధ్యతగా ప్రవర్తించాలి. జాలి, దయా, కరుణ అనేవి మాన సంబంధాల్లే కాకుండా మూగజీవాల పట్ల కూడా చూపించాలి.
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా జంతు ప్రేమికులు ఎందరు ఉన్నా మూగజీవాల ఆవేదనను అర్థం చేసుకొని వాటి రక్షణ మన కర్తవ్యంగా సమాజంలో మార్పు రావాలి అప్పుడే ధరణిలో మూగజీవాల ఆదరణకు ఆలవాలం కావాలి …
– జి జయ