ఇంగిత జ్ఞానం
ఇంగిత జ్ఞానం. చాలా మంది కి ఇది ఉండదు. ఎక్కడికి వచ్చామో ఏమి చేస్తున్నామో ఏమి మాట్లాడుతున్నానో అనేది తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నవ్వకండి..
ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి చనిపోయాడు. అందరూ అక్కడికి వచ్చారు కానీ కొడుకు అమెరికాలో ఉండడం వల్ల తెల్లారి వస్తాడు అని అలాగే ఉంచారు. కాసేపు ఏడుపులు పెడబొబ్బలు అయ్యాక ఒక పెద్దాయన పోయినవారమే ఇలా ఒకసారి జరిగింది అంటూ ఆ విశేషాలు చెప్పేసాడు. మరోవైపు అమ్మలకు అందరూ అంతకు ముందు వారం జరిగిన పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఒక కొత్త జంట తుంటరి చూపులు చూసుకుంటూ సరసాలు ఆడుకుంటున్నాయి .
పెళ్లి సంవత్సరం అయినా అమ్మాయి తన బిడ్డకు పాలు ఇవ్వాలని చాటు కోసం చూస్తోంది. ఆ అమ్మాయి భర్త ఆరాటంగా అంతా వెతుకుతున్నాడు చాటు కోసం, మరోవైపు కొందరు ఆడవాళ్లు కొత్తగా చేయించుకున్న నగల గురించి వాటి ధరల గురించి అవి తీసుకున్నప్పుడు ఆ షాపు వాడు చేసిన మోసం గురించి చెప్పుకుంటూ ఉన్నారు.
ఇంకొక వైపు ఇంకో ఆడవాళ్లు ఇద్దరు తాము అంతకు ముందు తీసుకున్న చీరల గురించి వాటి డిజైన్ల గురించి మాట్లాడుకుంటూ చీరల గొప్పతనం చీరలు ఏ రకంగా నేయాలో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని డిజైన్ల గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ మరొకరు ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుతున్నారు ఇంకొకరు ఫోన్లో చాటింగ్ చేస్తున్నారు.
ఆహారాన్ని ఇష్టపడే ఇంకొక అతను ఏ ఆహారాలు చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నాడు. ఇంతలో ఆహారం వచ్చిందంటూ తయారయ్యిందంటూ పిలుపులు వినిపించడంతో అందరూ శవాన్ని వదిలేసి ఫలవమంటూ పరిగెత్తారు పాపం ఆ పెద్దావిడ ఒకరు అలాగే కూర్చున్నారు. ఇలా చాలామందికి ఇంగిత జ్ఞానం అనేది ఉండదు తాను ఎక్కడికి వెళ్ళాము ఏం చేస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము అనేది చాలామంది గ్రహించారు సంబంధం లేని విషయాలు చెప్తూ ఉంటారు దాన్ని చాలా హాస్యంగా తీసుకుంటూ ఉంటారు.
అలాంటప్పుడు వీడిని ఎవరికైనా చూపించండిరా బాబు అని అనాలనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నప్పుడు కావాలని కొందరు తమని అందరూ గుర్తించాలని తపనతో మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి బయట ప్రపంచానికి వెళ్లి చూస్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉంటారు ఒకరు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మరొకరు ఇంకెవరితోనో గొడవ పెట్టుకుంటూ ఉంటారు.
ఇద్దరు ఎదురెదురుగానే ఉంటారు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారేమో గొడవపడుతున్నారేమో ఆమె అతన్ని చూసి నవ్వుతుందేమో అని అనుకుంటాం. మరొకతను చాలా గట్టిగా వాదిస్తూ ఉంటాడు వాళ్లు ముగ్గురు గొడవ పడుతున్నారు కానీ నిజానికి చూస్తే వాళ్ళ చెవులలో ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అంటే వారు చరవాణిలో ఇంకెవరితోనో మాట్లాడుతున్నారు అని అర్థం.
నాకు ఫోన్ తెలియని కొత్తలో నేను కూడా ఇలాగే భయపడి వాళ్ళకి కాస్త దూరంగా వెళ్లాను ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే వాళ్లు చరవాణిలో మాట్లాడుతున్నారు అని ఇలా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా మాట్లాడుతుంటే చాలా వింతగానో విచిత్రం కాదు అనిపించింది. ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడకూడదు అనేది తెలియడం చాలా ముఖ్యం.
– భవ్య చారు